Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

పిఠాపురం అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక దృష్టి ఉంటుంది

  •  తన నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి సమస్యా రానివ్వరు
  • జగ్గయ్య చెరువు కాలనీ సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తాం
  • పిఠాపురం పట్టణం, జగ్గయ్య చెరువు కాలనీ మహిళలతో ముఖాముఖీలో శాసన మండలి
    సభ్యుడు నాగబాబు

పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే కొణిదల పవన్ కళ్యాణ్ కి ఎప్పటికీ ప్రత్యేక దృష్టి ఉంటుందని శాసన మండలి సభ్యుడు కొణిదల నాగబాబు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా తక్షణం స్పందించే నాయకుడు పవన్ కళ్యాణ్… అలాంటిది తన సొంత నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి సమస్యా రానివ్వరు.. సమస్య ఉందీ అంటే పరిష్కారం అయ్యే వరకు వదిలిపెట్టరని స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం పిఠాపురం పట్టణ పరిధిలోని జగ్గయ్య చెరువు కాలనీలో మహిళలతో ముఖాముఖీ సమావేశం నిర్వహించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డ్రెయినేజీ, తాగునీరు, రోడ్డు సౌకర్యాలు లేక ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నట్టు ఆ ప్రాంతవాసులు వివరించారు. గతంలో రోడ్లు వేయకుండా కూడా వేసినట్టు బిల్లులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ సమస్యలు చెప్పడం ప్రజల హక్కు.. ప్రజా ప్రతినిధులుగా వాటిని పరిష్కరించడం మా బాధ్యత. పిఠాపురం నియోజకవర్గానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయన దృష్టికి వచ్చిన ఎవరెవరో సమస్యలు పరిష్కరిస్తారు. జగ్గయ్య చెరువు కాలనీవాసుల సమస్యలు కూడా ఆయన దృష్టికి వచ్చాయి. మీరు చెప్పిన సమస్యలన్నింటికీ త్వరలోనే పరిష్కారం చూపుతాం అన్నారు.

పవన్ కళ్యాణ్ ప్రతినిధులుగా వచ్చాం.. ప్రజలు సంతోషించేలా సౌకర్యాలు కల్పిస్తాం : శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్

శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రతినిధులుగా జగ్గయ్య చెరువు కాలనీవాసుల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చాం. మీ సమస్యలపై అధ్యయనం చేసి ఒక నివేదిక సమర్పించమని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. త్వరలో ఒక అధికార బృందాన్ని ఈ ప్రాంతానికి పంపి సమస్యలపై ఇంటింటి సర్వే నిర్వహిస్తాం. తక్షణం వాటి పరిష్కారంపై దృష్టి సారిస్తాం. ప్రజలు సమస్యలు చెప్పుకుంటే భారంగా భావించే నాయకుడు కాదు పవన్ కళ్యాణ్. తన దృష్టికి వచ్చిన సమస్యలు ఎప్పుడు పరిష్కరిద్దామా అని ఆలోచన చేసే నాయకుడు. జగ్గయ్య చెరువు కాలనీవాసులంతా సంతోషపడే విధంగా ఈ ప్రాంతంలో సౌకర్యాలు కల్పిస్తాము అన్నారు. సమస్యల తక్షణ పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ కుమార్, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు), పిఠాపురం నియోజవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, పిఠాపురం మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పిఠాపురంలో భారీ బైక్ ర్యాలీ

Dr Suneelkumar Yandra

ప్రజలకు చేరువగా ఉండి ప్రభుత్వ పధకాలను అందించడంలో భాద్యత తీసుకోవాలి

Dr Suneelkumar Yandra

అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు*  *పెళ్లి ముహూర్తాల తేదీలు ఇవే*

TNR NEWS

ఆవిర్భావ సభ భద్రత ఏర్పాట్లుపై మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష

Dr Suneelkumar Yandra

తెలుగు రాష్ట్రాల నుండి శబరి కి ప్రత్యేక రైళ్లు

TNR NEWS

బెట్టింగ్ మాఫియా డొంక లాగుతున్న పోలీసులు! నిర్వహుకులే అసలైన టార్గెట్..?

Dr Suneelkumar Yandra