వేసవికాలం దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైటెక్ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి అన్నారు.శుక్రవారం కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు ట్రస్టు సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్య అవసరాల కోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుండి ప్రజలు, బాటసారులతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో నేటి నుండి వేసవి కాలం పూర్తయ్యేంతవరకు తాగునీరు పంపిణీ చేయడం శుభ పరిణామం అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పైడిమర్రి సత్తిబాబు, కిట్స్ మహిళా కళాశాల చైర్మన్ నీల సత్యనారాయణ, ట్రస్టు ప్రధాన కార్యదర్శి చారుగండ్ల రాజశేఖర్, కార్యనిర్వాహక అధ్యక్షులు ఓరుగంటి కిట్టు, ఉపాధ్యక్షులు యధా సుధాకర్, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు వేంపాటి వెంకటేశ్వరరావు, యాదా శ్రీనివాస్, పందిరి సత్యనారాయణ, ప్రకాష్ రావు, ఓరుగంటి ప్రభాకర్, రాయపూడి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు…………
