కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలు మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రంగా థియేటర్ ఆవరణలో ఏర్పాటుచేసిన వేడుకలకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు చేతుల మీదుగా కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పేదల కోసం నిరంతరం పనిచేస్తున్న తమ అభిమాన నాయకురాలు ఉత్తమ్ పద్మావతి ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోని రాజకీయాల్లో మరెన్నో ఉన్నతమైన పదవులు అందుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చక్కెర చిన్నపరెడ్డి, కోదాడ అసోసియేషన్ అధ్యక్షులు వెంపటి మధుసుదన్, జిల్లా కోశాధికారి నవీన్ రెడ్డి, మిల్లర్స్ నీలా సత్యనారాయణ, కొత్త బ్రహ్మయ్య, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు, మాజీ అధ్యక్షులు అనంతరాములు, వెంపటి ప్రసాద్, సాయి తదితరులు పాల్గొన్నారు