Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

*మాలల సింహ గర్జన.. ఐక్యత కోసం.. హక్కుల కోసం: ఎమ్మెల్యే వివేక్..!!*

హైదరాబాద్: డిసెంబర్ 1న హైదరాబాద్‎లో జరగనున్న మాలల సింహ గర్జన సభను విజయవంతం చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు.

మాలల గుర్తింపు కోసమే జాతిని ఏకం చేస్తున్నామని.. మాలల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని అన్నారు. మాలల సింహగర్జన సభ నిర్వహణకు సంబంధించి శుక్రవారం (నవంబర్ 29) హైదరాబాద్‎లో ఎమ్మెల్యే వివేక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 30 లక్షల మంది మాలలు ఉన్నారు. ఇకనైనా మాలలు ముసుగు వేసుకుని ఇంట్లో కూర్చోకుండా బయటికి రావాలని పిలుపునిచ్చారు.

 

అన్నీ కులాల వారు సమావేశాలు నిర్వహించుకుంటారని.. అలాంటప్పుడు మాలలు సమావేశం జరుపుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. మేము వేరే కులాల గురించి మాట్లాడట్లేమని.. మా ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. తక్కువ సంఖ్యలో ఉన్న మాలలు దోచుకుంటున్నారని.. ప్రభుత్వ ఉద్యోగాల్లో పోస్ట్‎లు వారికే వస్తున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

 

సుప్రీంకోర్టు తీర్పు మాలలకే కాదు.. మాదిగలు, ఎస్టీలకు కూడా వ్యరేతికంగా ఉందన్నారు. సుప్రీం కోర్టు తీర్పు కుల వివక్ష లేదనే భావన కలిగించేలా ఉందని పేర్కొన్నారు. కుల వివక్ష, ఆర్థిక వెనుకబాటు ఒక్కటి కాదని రాజ్యాంగంలో అంబేద్కర్ స్పష్టంగా చెప్పారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ గుర్తు చేశారు. మేం ఎవరికీ వ్యతిరేకం కాదని.. రాజ్యాంగాన్ని కాపాడాలనే మా పోరాటమని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా కుల వివక్ష లేదని ఏ ఒక్కరైనా చెప్పగలరా అని ప్రశ్నించారు.

 

ఎస్సీ, ఎస్టీల్లో కుట్రలు ఉన్నాయి అలాంటి కుట్రలు మాలల్లో ఉండొద్దు అనేది మా లక్ష్యమని అన్నారు. మాలల హక్కుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించాం.. కానీ రాహుల్ గాంధీకి, ప్రభుత్వానికి ఎక్కడ మేం వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని ఎక్కడ లేదని.. దళితుల్లో విభజన తెచ్చే ప్రయత్నాలు చేయొద్దని కోరారు. మా మాల జాతి ఐక్యత కోసమే 2024, డిసెంబర్ 1న మాలల సింహగర్జన సభ నిర్వహిస్తున్నామని.. ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ పిలుపునిచ్చారు.

Related posts

మంత్రికి పాలాభిషేకం

TNR NEWS

గడువు లోపు ఓటర్ గా నమోదు చేసుకోండి… మద్నూర్ తహసిల్దార్ ఏం డి ముజీబ్

TNR NEWS

ఐక్యతకు, స్నేహభావాలకు వనభోజన మహోత్సవాలు ప్రతీకలు

TNR NEWS

కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు బిల్లు ను ఉపసంహరించుకోవాలి

TNR NEWS

తల్లిదండ్రుల సమావేశం

TNR NEWS

కొత్త మెనూ ఖచ్చితంగా పాటించాలి బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

TNR NEWS