హైదరాబాద్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం జరిగిన మాలల సింహగర్జనకు చేవెళ్ల మండలం నుంచి వివిధ సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘాలు, మాలలు నినాదాలు చేస్తూ భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి, బయలుదేరి వెళ్ళారు. కార్యక్రమంలో మండల కేంద్రంతో పాటు, మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.