సమాజంలో జరుగుతున్న అన్యాయలపై ప్రశ్నిస్తూ నిత్యం ప్రజా సంక్షేమం కోసం పరితపించే తూర్పు రమేష్ యొక్క సేవ భావాన్ని సమాజం పట్ల ఆయనకు ఉన్న అంకితభావాన్ని గుర్తించి తూర్పు రమేష్ కు ఆల్ ఇండియా బిసి, ఎస్ సి, ఎస్ టి, మైనారిటీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందచేసినా అల్ ఇండియా బిసి, ఎస్ సి, ఎస్ టి, మైనారిటీ సంక్షేమ సంఘము అధ్యక్షుడు కొత్త విజయ్ భాస్కర్. ఈసందర్బంగా తూర్పు రమేష్ మాట్లాడుతూ నా మీద నమ్మకం తో ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పగించిన ఆల్ ఇండియా బిసి, ఎస్ సి, ఎస్ టి, మైనారిటీ సంక్షేమ సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తేలుపుతున్నాను. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నీతి నిజాయతీగా పని చేస్తానని తెలియచేశారు.