Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

రైస్ మిల్లుల కాలుష్యం నుండి ప్రజలను కాపాడాలి

రైస్ మిల్లుల నుంచి వెలువడే కాలుష్యం నుండి తమను కాపాడాలని కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని తమ్మర,లక్ష్మీపురం కాలనీ ప్రజలు మంగళవారం సూర్యపేట జిల్లా కలెక్టర్, నల్గొండ పొల్యూషన్ బోర్డు అధికారులను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు బొల్లు ప్రసాద్ మాట్లాడుతూ కోదాడ,ఖమ్మం జాతీయ రహదారిని అనుకోని వున్నా శ్రీ లక్ష్మీ శ్రీనివాస, రాధాకృష్ణ, రాజ్యలక్ష్మి, శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఇండస్ట్రీ, పార్ బాయిల్డ్ రైస్ మిల్లుల నుంచి మురుగునీరు, బూడిద వ్యర్థ పదార్థాలతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని శ్వాస కోస సమస్యలు తలెత్తుతున్నాయని అదేవిధంగా రోడ్డుపై వెళ్లే వాహనదారులు బూడిద కళ్ళలో పడి అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. తాము మిల్లుల యజమానులను కలిసి ఎన్ని సార్లు విన్నవించిన సమస్యను పరిష్కరించడం లేదన్నారు. కావున అధికారులు కలుగజేసుకొని వెంటనే స్పందించి మిల్లులను మూసి వేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో వారి వెంట బొల్లు ప్రసాద్, సిరిపురపు హేమ, సట్టు వీరస్వామి, వెలీదే పద్మ, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు…….

Related posts

యువతిలకు వివాహానికి పుస్తె చీర అందజేత

TNR NEWS

డిజేఎఫ్ పెద్దపెల్లి జిల్లా ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం

TNR NEWS

రైతుల వరి కొనుగోలు కోసం కలెక్టర్ కు వినతి పత్రం

TNR NEWS

మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త .. త్వరలో ఖాతాల్లోకి డబ్బులు!

TNR NEWS

యువత స్వశక్తితో జీవితంలో రాణించాలి….. వినాయక బేకరీని ప్రారంభించిన మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్

TNR NEWS

రైతులపై దాడులకు పాల్పడిన వారిపై చర్య తీసుకోవాలి.  రైతాంగం పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి.  రైతాంగానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి ఎస్కేయం డిమాండ్

TNR NEWS