Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
క్రీడా వార్తలుతెలంగాణ

క్రీడలతో మానసిక ఉల్లాసం

ఒత్తిడి నుంచి బయటపడేందుకు,మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని కోదాడ సీనియర్ సివిల్ జడ్జి కే సురేష్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి భవ్యాలు అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని కోర్టు ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కోదాడ బర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి నిర్వహిస్తున్న క్రీడా పోటీలను అధ్యక్షులు ఎస్ ఆర్ కే మూర్తితో కలిసి వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. క్రీడలు ఐకమత్యం,స్నేహభావం పెంపొందించడంతోపాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ఒత్తిడి నుంచి బయటపడేందుకు న్యాయవాదులు, సిబ్బంది క్రీడా పోటీల్లో పాల్గొనాలన్నారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు గణతంత్ర దినోత్సవం రోజున బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ ఆర్ కే.మూర్తి, సెక్రటరీ చింతకుంట్ల రామిరెడ్డి,ఉపాధ్యక్షులు గట్ల. నరసింహారావు, జనరల్ సెక్రటరీ చింతకుంట్ల. రామిరెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిలివేరు వెంకటేశ్వర్లు, గేమ్స్ సెక్రటరీ హేమలత, బాదే దుర్గ, దొడ్డ శ్రీధర్, ఈదుల కృష్ణయ్య, ఎండి రియాజ్, కోదండపాణి, మల్లికార్జునరావు, ఎండి నసీర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు……….

Related posts

కోదాడ మాతా నగర్ లో ఘనంగా సెమి క్రిస్మస్ వేడుకలు……..

TNR NEWS

ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ఉచితం

TNR NEWS

యువత క్రీడల్లో రాణించాలి

TNR NEWS

వరంగల్: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అఘోరి 

TNR NEWS

రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన విద్యార్థి

TNR NEWS

ఉత్సాహంగా కుంగ్ ఫూ కరాటే పోటీలు

TNR NEWS