తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షునిగా సూర్యాపేట జిల్లాలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్న ఊటుకూరి జానకి రాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఇటీవలే అదిలాబాద్ జిల్లాలో జరిగిన సంఘ మహాసభలలో ఈ ఎన్నిక జరిగినట్లు జానకి రాములు ఆదివారం స్థానికంగా తెలిపారు ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక ఉపాద్యాయ సంఘాలు ఉన్నప్పటికీ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారం చూపడంలోనూ,ఉద్యమాలు చేపట్టడంలోనూ టియుటిఎఫ్ సంఘం ముందుంటుందని వెల్లడించారు.తనపై ఉన్న నమ్మకంతో నాకు ఇంతటి బాధ్యతను అప్పగించినందుకు తన భాధ్యత మరింత పెరిగిందని,అంతే రీతిలో సంఘ అభివృద్ధితో పాటు ఉపాధ్యాయుల సమస్యలపై పరిష్కారం చూపేందుకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.తన ఎన్నికకు సహకరించిన సంఘ నాయకులకు,సహచర ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా జానకి రాములుకు పలువురు సంఘ నాయకులు ఉపాద్యాయులు, బందు మిత్రులు శుభాకాంక్షలు చెప్పారు.కాగా జానకి రాములు ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి మండలం వరదాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్(ఇంగ్లీష్) ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు.