గజ్వేల్ లో నియోజకవర్గం ముదిరాజ్ ల ఆధ్వర్యంలో ఘనంగా నీలం మధు ముదిరాజ్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముదిరాజ్ జాతి ముద్దుబిడ్డ ప్రజాసేవకులు ప్రముఖ నాయకులు ఇకముందు మరెన్నో జన్మదినోత్సవాలు నిర్వహించుకోవాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నామని నీలం మధు ముదిరాజ్ కు ప్రభుత్వంలో ఉన్నత మైన పదవిని ఇస్తూ గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాం అన్నారు. మహిళా దినోత్సవం సందర్బంగా రాష్ట్ర ఆదర్శ మహిళా అవార్డు అందుకున్న
కొన్నే జయమ్మ ముదిరాజ్ ను ప్రముఖులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ముదిరాజ్ నాయకులు ఉమ్మడి మెదక్ జిల్లా ప్రదానకార్యదర్శి తలారి బిక్షపతి, గజ్వేల్ నియోజకవర్గ ముదిరాజ్ అధ్యక్షులు గుంటుకు శ్రీనివాస్, వర్గల్ అధ్యక్షుడు శ్రీరాం నర్సింలు, జగదేవపూర్ అధ్యక్షుడు రాగుల రాజు, మహిళ అధ్యక్షులు కొన్నే జయమ్మ, యువజన అధ్యక్షులు హేమ సురేష్, సీనియర్ నాయకులు ఆగ్రారం వెంకటయ్య, ఈమంపూర్ వెంకటయ్య, మర్కుక్ అధ్యక్షుడు లింగ సత్యనారాయణ, వంటిమామిడి మాజీ ఏఎంసి డైరెక్టర్ నిమ్మకాయల గణేష్, శేఖర్, నవీన్, నర్సింలు, వర్ధరాజపూర్ మధు, నెంటూర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.