Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

పిఠాపురం నియోజక వర్గం పల్లెలకు రహదారి కళ

  • నిర్మాణం పూర్తి చేసుకున్న పల్లె పండుగ రోడ్లు

 

  • కొత్త రోడ్లను ప్రారంభించిన శాసన మండలి సభ్యుడు నాగబాబు

 

పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా పల్లె పండుగ కార్యక్రమం ద్వారా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన గ్రామీణ రహదారులను శాసన మండలి సభ్యుడు కొణిదల నాగబాబు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ రోడ్లు నిర్మించారు. శనివారం ఉదయం పిఠాపురం మండలం, కుమారపురం హౌసింగ్ లే అవుట్ –1లో రూ.15.70 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం విరవ గ్రామం నుంచి గోకివాడ బ్రిడ్జి వరకు యంజీఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి రూ.75 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన తారు రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. రోడ్డు నాణ్యతను పరిశీలించారు. విరవ నుంచి కోలంక, గోకివాడలను కలుపుకొంటూ ఈ రహదారి వెళ్తుంది. ఈ కార్యక్రమంలో ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ కుమార్, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు), మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన పార్టీ పిఠాపురం నియోజక వర్గం సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాసరావు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కుక్కుటేశ్వరుడి హుండీ ఆదాయం రూ.11,61,650

Dr Suneelkumar Yandra

జాతీయ మహిళా కమిషన్ కొత్త ఛైర్ పర్సన్ గా విజయా కిశోర్

TNR NEWS

నవ వధూవరులకు శ్రీవారి అక్షతలు

TNR NEWS

విలీన గ్రామాలకు 70% ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలి.. లేకుంటే విలీన పెండింగ్ ప్రక్రియ పూర్తి చేసి కార్పోరేషన్ ఎన్నికలు నిర్వహించాలి

Dr Suneelkumar Yandra

మానవ జీవన మనుగడకు దిక్సూచి… “షాతత్వ” గ్రంధం – పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా

Dr Suneelkumar Yandra

ఏపీ అసెంబ్లీలో ప్రారంభమైన 2024-25 బడ్జెట్‌ సమావేశాలు..!

TNR NEWS