యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని డీఎస్పీ శ్రీధర్ రెడ్డి అన్నారు.శనివారం కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి సార్జింగ్ పేటలో కోదాడ పట్టణ సీఐ శివ శంకర్ అధ్వర్యంలో పోలీసు కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించి తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో నివాసాలు,వాహనాలు, దుకాణాలు పోలీసులు పరిశీలించారు. సరైన అనుమతి పత్రాలు లేని 34 ద్విచక్ర వాహనాలు 4 ఆటోలను సీజ్ చేశారు.