Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

అమ్మాపురం ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం  విద్యార్థు బావి భారత నిర్మాతలు : హెడమాస్టర్ వెంకటేశ్వర్లు 

మహబూబాబాద్ జిల్లా,తొర్రూర్ మండలం అమ్మాపురం జిల్లా పరిషత్ సెకండరి పాఠశాలలో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా యోగ ఇన్స్ట్రక్టర్ లింగాల మురళి కృష్ణ విద్యార్థులకు ధ్యానం నిజజీవితంలో ఏవిదంగా చేయాలో వివరించారు.ధ్యానం చేయడం వలన కలిగే ఉపయోగాలు చెప్పారు. అదేవిధంగా వారిచే ధ్యానం చేయించడం జరిగింది. ఈ సందర్బంగా విద్యార్థులు ప్రతి రోజు ధ్యానం చేయడం ద్వారా తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పే పాఠ్యంశాలు చక్కగా అర్ధమవుతాయాన్నారు. పాఠశాల హెడ్ మాస్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతు.. విద్యార్థులు విధిగా ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలన్నారు.విద్యార్థులు బావి భారత నిర్మాతలు, కాబట్టి కష్ట పడి చదుకోవాలన్నారు. ధ్యానం యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

*సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యునిగా మట్టి పెళ్లి సైదులు ఎన్నిక…..* 

TNR NEWS

అదుపుతప్పి ముక్త్యాల బ్రాంచ్ కాలువలో పడిన ఆటో పలువురికి గాయాలు

TNR NEWS

పల్లెల్లో ప్రజలు ఐక్యంగా సంస్కృతి,సాంప్రదాయాలను కాపాడాలి…. డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్…

TNR NEWS

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

TNR NEWS

మాస్టర్ ప్లాన్ రద్ధు జివో జారీ చేయాలి లేకుంటే ఉధ్యమం తీవ్రతరం

TNR NEWS

నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుడు ఉన్నం హనుమంతరావు

Harish Hs