నారాయణపేట జిల్లా మద్దూర్ మండల పరిధిలోని పేదిరిపాడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ఉదయం మండల విద్యాశాఖ అధికారి ప్రధానోపాధ్యాయులు బలకిష్టప్ప, గ్రామ యువజన సంఘం మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతులమీదుగా బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖాళీ కడుపుతో పాఠశాలలకు వస్తున్న విద్యార్థుల ఆకలిని తీర్చి వారికి విద్యాబుద్ధులు నేర్పించాలనే లక్ష్యంతో హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యముతో కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాలల్లో అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ఆనందం అన్నారు అలాగే ఈ బ్రేక్ ఫాస్ట్ ద్వారా విద్యార్థుల హాజరు శాతం మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో
ఉపాధ్యాయులు, పాఠశాల చెర్మెన్, గ్రామ యువజన సంఘం నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.