Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

బెల్లం చాయ్ తాగి చూడు బాయ్ –కోదాడలో క్యూ కడుతున్న చాయ్ ప్రియులు.  — ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు.  — స్వయం ఉపాధి వైపు ఇరువురి సోదరులు అడుగులు  — బెల్లం టీ స్టాల్ తో లభిస్తున్న ఆదాయం  — నిరుద్యోగ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న యువకులు….

 

ఇటీవల కాలంలో అందరికీ ఆరోగ్యం వైపు స్పృహ పెరిగింది . తినే ప్రతి దాని గురించి తెలుసుకుని మరీ తింటున్నారు. రోగాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆరోగ్యానికి మేలు చేసే వాటిని ఎంచుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని బెల్లంతో తయారుచేసిన చాయ్ ను అందరూ ఇష్టంగా తాగుతున్నారు. పంచదారకు ప్రత్యామ్నాయంగా బెల్లం తో తయారు చేసిన టీకి మంచి గిరాకీ లభిస్తుంది. చాయ్ ఆస్వాదించడంతో పాటు ఆరోగ్యకరంగా ప్రయోజనాలు ఉండడంతో బెల్లం టీ కి చాయ్ క్యూ కడుతున్నారు.

*కోదాడలో మొదటిసారిగా*

పట్టణంలోని హుజూర్నగర్ రోడ్ లోని అమృత ప్రవేట్ హాస్పటల్ ప్రక్కన ఏర్పాటు చేసిన బెల్లం టీకి ఆదరణ లభిస్తుంది. కోదాడ పట్టణంలో మొట్టమొదటి బెల్లం చాయ్ పేరు సంపాదించింది. చిలుకూరు మండలం కటకమ్మగూడెం గ్రామానికి చెందిన కటికోళ్ల రామకృష్ణ వెంకటకృష్ణ ఇరువురి సోదరులు హైదరాబాదులో అమృత తుల్య బెల్లం సాయ్ గురించి తెలుసుకున్న వారు హైదరాబాద్ పట్టణంలోకి తుక్కగూడ లోని మెయిన్ బ్రాంచ్ వద్ద అజయ్ మాస్టర్ వద్ద శిక్షణ తీసుకున్నారు. అనంతరం కోదాడ పట్టణంలో షాపులు ప్రారంభించారు. ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో హైదరాబాద్ అమృత తుల్య బెల్లం టి స్టాల్ 40 బ్రాంచీలు ఉండగా, ఒక్క సూర్యాపేట జిల్లాలోని 14 వరకు బ్రాంచ్ లు ఉన్నాయని తెలుస్తుంది. సాధారణంగా చెక్కరతో తయారు చేసే టి ఎక్కడైనా లభిస్తుంది బెల్లం టి మాత్రం అరుదు. అందుకే కోదాడలో ఏర్పాటు చేయాలని భావించారు. నవంబర్ నెలలో సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ పట్టణ ప్రముఖ వైద్యులు జాప్తి సుబ్బారావు చేతుల మీదగా ప్రారంభించారు.

*బెల్లం ఛాయ్ తో అనేక ప్రయోజనాలు*

దీని గురించి తెలుసుకుని చాలామంది వచ్చి బెల్లం టీ తాగి వెళ్తున్నారు. అనారోగ్యం కారణాల కారణంగా చక్కెర పదార్థాలను తీసుకునేందుకు చాలామంది వెనుకంజ వేస్తున్న రోజులు ఇవి. షుగర్ వ్యాధిగ్రస్తులు, ఊబకాయం ఉన్నవాళ్లు చెక్కర పదార్థాలను తినాలంటే భయ పడతారు. అయితే చక్కెరకు బదులుగా బెల్లంతో తయారుచేసిన పదార్థాలను కొంతమేర తీసుకుంటారు. అందుకే కోదాడ పట్టణంలోని బెల్లం చాయ్ (అమృత తుల్య) ను అందుబాటులోకి తీసుకురాగా స్థానికులు ఇష్టంగా తాగుతున్నారు. బెల్లం చాయ్ వల్ల వ్యాధుల సక్రమణను నియంత్రించడంతో పాటు రోగ నిరోధక శక్తి పెంచుతుంది. రక్తహీనతను దూరం చేస్తుంది కీళ్ల నొప్పులు రక్తపోటును సైతం అదుపులో ఉంచుతుందని స్థానికులు చెబుతున్నారు. చక్కెర కారణంగా చాయ్ తాగలేకపోతున్న అనేక మంది ఈ బెల్లం చాయ్ తాగుతున్నారు. చాయ్ ను ఆస్వాదించటం తో పాటు ఆరోగ్య ప్రయోజనాలు పొందుతున్నామని చెబుతున్నారు. బెల్లం తో తయారు చేస్తున్న చాయ్ మంచి ఆదరణ లభిస్తుంది.

*చాయ్ ఒక్కసారి తాగండి బాయ్*

కటికోళ్ల వెంకటకృష్ణ బెల్లం టి స్టాల్ నిర్వాహకుడు.

షుగర్ వ్యాధి చాలామందికి వస్తుంది. ఈ క్రమంలో బెల్లం టి కాన్సెప్ట్ తీసుకుందామని. కోదాడ పట్టణంలో ఎక్కువగా పంచదారతో తయారు చేసే టీ స్టాలే అందుబాటులో ఉన్నాయి. కొత్త రకం పరిచయం చేయాలని చదువు పూర్తయి ఖాళీగా ఉంటున్న సమయంలో స్వయం ఉపాధి వైపు అడుగులు వేశాం. ఇరువురం సోదరులం (రామకృష్ణ వెంకటకృష్ణ) నాలుగు లక్షల వరకు పెట్టుబడి పెట్టి (హైదరాబాద్ అమృత తుల్య) బెల్లంటి ప్రారంభించాం. ప్రస్తుతం ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగం రాలేదని దిగులు రాకుండా స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి.

Related posts

ఈనెల 24న జిల్లా కరాటే అసోసియేషన్ల ముఖ్య సమావేశం

Harish Hs

నలుగురు పేకాటరాయుళ్ళ అరెస్ట్… ఎస్సై దికొండ రమేష్ ఆధ్వర్యంలో.. రూ. 4700 స్వాధీనం…నలుగురిపై కేసు నమోదు

TNR NEWS

TNR NEWS

ప్రతి విద్యార్థిని ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకోవాలి సిఐ జగడం నరేష్

TNR NEWS

అమ్మాపురం లో ఉచిత కంటి పరీక్ష శిబిరం 

TNR NEWS

ఉపాధ్యాయులు.,.. అంకితభావంతో పనిచేయాలి 

TNR NEWS