మల్యాల మండల కేంద్రంలోని బ్లాక్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా దళిత సంఘ నాయకులు మాట్లాడుతూ సమాజంలో అసమానతలమీద అలుపెరుగని పోరాటం చేసి,మహిళ హక్కుల కోసం విశేష కృషిచేసిన సంఘసంస్కర్త మహనీయురాలు శ్రీమతి సావిత్రిబాయి పూలే అని, ఈనాడు మహిళలు అన్ని రంగాల్లో రాణించడానికి మూల కారణం సావిత్రిబాయి పూలే అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు.. మ్యాక లక్ష్మణ్, మారంపల్లి లక్ష్మణ్, శనిగారపు తిరుపతి, ముప్పారపు రవీందర్, మల్యాల సతీష్ కుమార్, మాడుగుల వెంకటస్వామి,మోనుగూరి అజయ్, మల్యాల నారాయణ, మోత్కుల నర్సయ్య, అంజయ్య, ప్రసాద్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.