కాకినాడ : వేసవిలో అధికంగా వుండే గృహవిద్యుత్ వాడకాన్ని సంపద సృష్టికి ఆసరాగా చేసుకుని గృహ విద్యుత్ వినియోగదారులపై రాయితీలు ప్రకటిస్తూ అదనపు లోడ్ భారాలు మోపడం తగదని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. కిలో వాట్ కు రూ.1200లు మించితే రూ.2,450 రెండు కిలో వాట్స్ దాటితే రూ.3,650లు అదనంగా వసూలు చేసేందుకు టార్గెట్స్ పెట్టడం అంట కత్తెర చోద్యంగా వుందన్నారు. ట్రూఅప్ తదితర తాడు బొంగరం లేని అదనపు చార్జెస్ పేరిట విద్యుత్ బిల్లులు అధికం కాగా, వేసవి ఎండల్లో కిలో వాట్ టార్గెట్స్ తగదన్నారు. ట్రాన్స్ కో ప్రకటించిన 50శాతం రాయితీ వేసవికి అడ్వాన్స్డ్ క్షవర కళ్యాణంగా వుంద న్నారు. యూనిట్ రేట్లు ఇప్పటికే అధికంగా వున్నందున అదనపు భారాలు రెండు కిలో వాట్స్ వరకు గృహ వినియోగదారులపై లేకుండా రద్దు చేయాలని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు డిమాండ్ చేశారు.

previous post