May 17, 2026
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబును మరిచిపోయిన అధికారులు.. సొంత ఇలాఖాలోనే ఇలానా?

సీఎం చంద్రబాబును మరిచిపోయిన అధికారులు.. సొంత ఇలాఖాలోనే ఇలానా?

సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రినే మర్చిపోవటం విమర్శలకు తావిస్తోంది. యూనివర్సిటీ అధికారుల నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్ కావటంతో తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. ముఖ్యమంత్రి పేరునే మర్చిపోతారా అంటూ మండిపడుతున్నారు. స్థానిక నేతలైనా ఈ విషయాన్ని చూసుకోవాలి కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో నెటిజనం కూడా ఇదే రీతిలో కామెంట్లు చేస్తున్నారు.

అసలు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళ్తే.. కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ 27వ వార్షికోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ వార్షికోత్సవానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. ఇక కార్యక్రమానికి ఎవరెవరు వస్తున్నారనే వివరాలతో ఆహ్వాన పత్రికలు ముద్రించి.. పంపిణీ చేశారు. అయితే కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ ఆహ్వాన పత్రికలో స్థానిక ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబు పేరును మాత్రం అధికారులు మరిచిపోయారు. ఆ కార్యక్రమానికి హాజరైనా, కాకపోయినా ప్రోటోకాల్ ప్రకారం లోకల్ ఎమ్మెల్యేగా చంద్రబాబు పేరు అందులో ఉండాలి. కానీ అధికారుల నిర్వాకం కారణంగా చంద్రబాబు పేరు మిస్సైంది. ఇక ద్రవిడ యూనివర్సిటీ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ కావటంతో.. తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. సీఎం పేరునే మరిచిపోతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ద్రవిడ యూనివర్సిటీ ఆహ్వాన పత్రికలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఐఏఎస్ అధికారులు సుమిత్ కుమార్, వికాస్ మర్మత్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దొరస్వామి, ప్రొఫెసర్ సంపత్ కుమార్ పేర్లు ఉన్నాయి. అయితే నియోజకవర్గంలో జరిగే ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా అందులో స్థానిక ఎమ్మెల్యే పేరు ఉండాలి. ఈ ప్రోటోకాల్‌ను పాటించడంలో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చంద్రబాబు పేరు ఇందులో కనిపించకుండా పోయింది. ఈ ఆహ్వాన పత్రిక ప్రస్తుతం వైరల్ కావడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దీనిపై కామెంట్లు చేస్తున్నారు.

Related posts

కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి – ఎఐటియుసి డిమాండ్

Dr Suneelkumar Yandra

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే సత్యానందరావు

Dr Suneelkumar Yandra

రోలుగుంట, రావికమతం నాయకులతో సమావేశం నిర్వహించిన చోడవరం నియోజకవర్గ ఇంచార్జి పి.వి.ఎస్.ఎన్.రాజు

Dr Suneelkumar Yandra

అనపాల సేవలు అభినందనీయం – రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ

Dr Suneelkumar Yandra

ఉపాధి పనులు పరిశీలించిన పాడా పీడీ

Dr Suneelkumar Yandra

తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ: ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్:*

TNR NEWS