కోదాడ పట్టణానికి చెందిన చింతలపాటి శ్రీరాములు-నాగమణి కుమార్తె,డాక్టర్ నాగేంద్రం సతీమణి చింతలపాటి మమత కు ఉస్మానియా యూనివర్శిటీలో పి హెచ్ డి పూర్తి చేశారు.
ఉస్మానియా యూనివర్శిటీ బిజినెస్ మేనేజిమెంట్ విభాగంలో “కోవిడ్ మహమ్మారికి
ముందు మరియు తరువాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉద్యోగుల నిలుపుదల వ్యూహాలపై
తులనాత్మక అధ్యయనం”అనే పరిశోధన అంశంపై ప్రొఫెసర్ వి.శేఖర్ పర్యవేక్షణలో చింతలపాటి
మమత పరిశోధన పూర్తి చేశారు.
ఈ సందర్భంగా బుధవారం ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన 84 వ స్నాతకోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ,ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ మొగుళారం చేతుల మీదుగా పి హెచ్ డి పట్టా స్వీకరించారు.
ఈ సందర్భంగా డా.చింతలపాటి
మమతకు గ్రామస్తులు,కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.