Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే వారు జాగ్రత్తలు పాటించాలి. వేడుకల పేరుతో ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు. జిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్తు తో పెట్రోలింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.  సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ ‌

నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకునే వారు జాగ్రత్తలు పాటించాలి, ప్రమాదాలకు దూరంగా ఉంటూ పిల్లలు పెద్దలు అందరూ వారి ఇండ్లలో ఉత్సవాలు జరుపుకోవాలి, పోలీసు వారి సూచనలు పాటించాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ జిల్లా ప్రజలకు సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండ పోలీస్ శాఖ తరుపున భద్రత ఏర్పాట్లు చేయడం జరిగినది అని తెలిపారు.డిసెంబర్ 31 రాత్రి వేడుకలు, నిర్వహించుకునే నూతన సంవత్సర వేడుకల సందర్బంగా జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం ముఖ్యంగా పటిష్ఠమైన బందోబస్త్ నిత్యం పెట్రోలింగ్‌ నిర్వహించడం జరుగుతుంది. పట్టణ, గ్రామీణా ప్రాంతాల్లోను డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ తనీఖీలు నిర్వహించబడుతాయని. అలాగే ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే విధంగా బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలను నిర్వహిస్తే వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

 

*పోలీసుల సూచనలు నిబంధనలు….*

 

– నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసుకునే కార్యక్రమాలు రాత్రి 12:30 గంటల వరకు పూర్తి కావాలి. తర్వాత కొనసాగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం

– పిల్లల పట్ల జాగ్రత్తలు పాటించాలి, మైనర్స్ కు వాహనాలు ఇవ్వవద్దు

– టపాసులు, డీజే లు నిషేధం.

– మద్యం మత్తులో వాహనాలు నడపడం నేరం, వాహనాలు వేగంగా నడపవద్దు.

– రహదారులు బ్లాక్ చేసి ఉత్సవాలు చేయవద్దు.

– మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవద్దు.

– ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు.

– ఇల్లు, ప్రవేట్ ఆస్తులపై, వీధి దీపాల పై రాళ్లు వేయడం, అద్దాలను పగలగొట్టడం నేరం. .

– ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్ లను తీసివేసి వాహనాలు నడపడం, శబ్ద కాలుష్యం చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటా౦.

– న్యూ ఇయర్ వేడుకలలో నిషేదిత డ్రగ్స్, గాంజా వంటి మత్తు పదార్థాలు విక్రయించిన, వినియోగించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

– మద్యం దుకాణాలను నిర్ణీత సమయంలో క్లోజ్ చేయాలి, మైనర్లకు మద్యం అమ్మకూడదు.

– బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే కేసులు పెడుతాం.

– మైనర్లు వాహనాలు వాహనాలు ఇవ్వవద్దు.

– ఈ నూతన సంవత్సర వేడుకుల సందర్బంగా ఎర్పాటు చేసే ఎలాంటి కార్యక్రమాలు అయన సరే నిర్వహకులు తప్పని సరిగా పోలీసు అధికారుల నుండి ముందస్తూ అనుమతులు తీసుకోవాలి.

– న్యూ ఇయర్ అఫర్ ల పేరిట సైబర్ నేరగాళ్లు ఆర్థిక నష్టం కలిగించే అవకాశం ఉన్నది కావున ఆన్లైన్ నందు, అపరిచితులతో వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ అకౌంట్ వివరాలు, పిన్ నబర్స్ లు ఇవ్వవద్దు.

 

అంక్షలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు అని ఎస్పి గారు హెచ్చరించారు. అత్యవసర సమయంలో స్థానిక పోలీసు అధికారులకు, డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసు సేవలు ఉపయోగించుకోవాలి అని ఎస్పీ కోరారు.

Related posts

వైద్యవృత్తి ఎంతో పవిత్రమైనది కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ 

TNR NEWS

మెడికల్ షాప్ అసోసియేషన్ మండల అధ్యక్షుడుగా సుమన్

Harish Hs

కాంగ్రేస్ ప్రభుత్వం కల్లు గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి, బెల్లంకొండ వెంకటేశ్వర్లు KGKS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

TNR NEWS

నేడు వామపక్ష నేతలతో కలిసి లగచర్ల పర్యటన,*   *భాధిత రైతులకు అండగా నిలుస్తాము,*   *విదేశీ సంస్థలకు భూములప్పగించేందుకే ఫార్మా కంపెనీల ఏర్పాటు,*   *కేసీఆర్ అహంకార విధానాలనే అనుసరిస్తున్న రేవంత్ రెడ్డి,*   *బిజెపి అనుసరించే మతోన్మాద విధానాలపై పార్టీ నిరంతరం పోరాటం,*   *కలెక్టర్, అధికారులపై దాడి కరెక్ట్ కాదు….సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.*

TNR NEWS

సమగ్ర శిక్ష ఉద్యోగుల ధూంధాం కోలాటాలు నృత్యంతో నిరసన సీఎం హామీ నిలబెట్టుకోవాలి జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ

TNR NEWS

సోమవారం ప్రజావాణి రద్దు  వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం రద్దు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

TNR NEWS