Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

సుబ్బరామయ్య సేవలు చిరస్మరణీయం…..  కోదాడ అభివృద్ధిలో సుబ్బరామయ్య చేసిన కృషి అభినందనీయం……..  కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు…..

కోదాడ మాజీ సర్పంచ్ చిట్టబత్తిని సుబ్బరామయ్య సేవలు చిరస్మరణీయమని మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు అన్నారు. సోమవారం సుబ్బరామయ్య వర్ధంతి సందర్భంగా కోదాడ పట్టణంలోని రాజీవ్ చౌక్ చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కుటుంబ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కోదాడ అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. నేటి నాయకులు వారిని ఆదర్శంగా తీసుకొని వారు చూపిన బాటలో నడవాలి అన్నారు. వారి ఆశయాల సాధన కొరకుప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు,మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు,కుటుంబ సభ్యులు వరప్రసాద్, నరసింహారావు, శివరామయ్య,తొండాపూ సతీష్, బాగ్దాద్,డేగ శ్రీధర్, రాయపూడి వెంకటనారాయణ, ఉప్పుగండ్ల శ్రీను,చంద్రశేఖర్,పతంగి శ్రీను,పాలూరి సత్యనారాయణ, కేశవులు,బషీర్,జానకి రామయ్య, చింతలపాటి శ్రీనివాసరావు,హబీబ్,సుబ్బారావు, సైదా నాయక్,ఆదమ్,పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు………

Related posts

ఈవీఎంల స్ట్రాంగ్ రూములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రతిజ్ జైన్

TNR NEWS

*గూడూరులో మండల స్థాయి గణిత ప్రతిభ పోటీలు*

TNR NEWS

మీడియా సమాజానికి అద్దం లాంటిదని జిల్లా కలెక్టర్ :ఇలా త్రిపాఠి

TNR NEWS

కొనసాగుతున్న సైన్స్ ఫేర్   ఆకట్టుకున్న ఐఆర్ బేస్డ్ ట్రాఫిక్ డెన్సిటీ సిగ్నల్ అడ్జస్ట్మెంట్ 

TNR NEWS

ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గం  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య

TNR NEWS

ఘనంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు ● ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేసిన బీఆర్ఎస్ నాయకులు

TNR NEWS