Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సృజనకు పునాది పుస్తకాలు” తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులు జూలూరు గౌరీ శంకర్

కోదాడ లోని కె .ఆర్. ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్.ఎస్.ఎస్ విభాగం ఆధ్వర్యంలో “సృజనకు పునాది – పుస్తకాలు” అనే అంశంపై మంగళవారం నాడు విద్యార్థులకు సెమినార్ నిర్వహించడం జరిగింది. ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం అధికారి వేముల వెంకటేశ్వర్లు సమన్వయ కర్తగా, కళాశాల ప్రిన్సిపాల్ ఎన్. రమణారెడ్డి సభాధ్యక్షులుగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా కవి, కళాశాల పూర్వ విద్యార్థి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులు, ముఖ్య అతిథి “జూలూరు గౌరీ శంకర్” పాల్గొని ఆయన మాట్లాడుతూ….

ఒక మంచి పుస్తకం జీవితాన్ని మార్చేస్తుందని ఆయన అన్నారు. సమాజ లోతుపాతుల్ని విశ్లేషించి శాస్త్రీయ దృక్పథాన్ని అందించే ఒక పుస్తకం దేశం యొక్క దశ, దిశను కూడా మార్చి వేస్తుందని తెలిపారు…. దేశంలోని అట్టడుగు వర్గాల జాతుల విముక్తిని అంబేద్కర్ తన జ్ఞానంతోనే విముక్తి చేశారని తెలిపారు. పుస్తకాలు చదువుకున్న నాయకుడు తన దేశానికి ఆలోచనలతో వ్యవస్థను శక్తివంతంగా తీర్చిదిద్దుతారని తెలిపారు . సమాజంలోని సర్వ రుగ్మతలను పారద్రోల గల శక్తి సామర్ధ్యాలు పుస్తకాలకు ఉందని చెప్పారు. సమాజ నిర్మాణానికి పుస్తకాలు పనిముట్లుగా ఉపయోగపడతాయని జూలూరు విశ్లేషించారు.

అందరూ నిరంతర అధ్యయనం చేయడం వల్ల మంచి ఫలితాలు సాధించి, జీవితంలో స్థిరపడవచ్చు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు జి.లక్ష్మయ్య, ఆర్.పిచ్చిరెడ్డి,వేముల వెంకటేశ్వర్లు,

జి.యాదగిరి,వి. బల భీమారావు, జి.నాగరాజు, యం.ప్రభాకర్ రెడ్డి, ఆర్.రమేష్, పి.రాజేష్, ఎం.రత్నకుమారి, బి. రమేష్ బాబు, జి. వెంకన్న, పి .తిరుమల,యస్.గోపికృష్ణ, ఎం .చంద్రశేఖర్, యస్. కె.ముస్తఫా, ఇ . సైదులు, యస్.కె.ఆరీఫ్,యన్.రాంబాబు, కె.శాంతయ్య, ఎన్. జ్యోతిలక్ష్మి,ఆర్. చంద్రశేఖర్, యస్.వెంకటాచారి, టి.మమత, డి .ఎస్ .రావు మొదలగు వారు పాల్గొన్నారు.

Related posts

ప్రతి విద్యార్థిని ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకోవాలి సిఐ జగడం నరేష్

TNR NEWS

TNR NEWS

అనాధ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

Harish Hs

ఐకెపి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్

TNR NEWS

ఆర్యవైశ్యులు సంఘటితంగా ఉండాలి

TNR NEWS

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి ఘనంగా ప్రతిభ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు

TNR NEWS