Tnrnews.in
తెలంగాణ

తహసిల్దార్ కార్యాలయంలో ఫైర్ పై అవగాహన  :ఫైర్ ఫై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి  : తహసిల్దార్ సంతోష్ కిరణ్

కోదాడ : ప్రజా పాలన ప్రగతి ప్రణాళికల 99 రోజులలో భాగంగా స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో అగ్నిమాపక అధికారి కందుల డాక్టర్ బాబు ఆధ్వర్యంలో ఫైర్ ఫై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ సంతోష్ కిరణ్ పాల్గొని అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు డీసీపీ, సిఓటును ఎలా ఉపయోగించాలో మాక్ ఢిల్లీ ద్వారా చూయించారు. అనంతరం తహసిల్దార్ మాట్లాడుతూ మనం విధులు నిర్వహిస్తున్న కార్యాలయాలలో, మనం నివసిస్తున్న ప్రాంతాలలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఆ ప్రమాదాలను నివారించడానికి పాటించవలసిన నిబంధనలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. మీరు ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరుగుతున్న దాన్ని చూసినట్లయితే తక్షణమే 101 కి కాల్ చేసి ఆ అగ్ని ప్రమాదాన్ని నివారించడానికి సహకరించాలని అన్నారు. ఈ వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవించే అవకాశాలు ఉన్నందున ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా రైతులు పంట పొలాలలో గడ్డిని తగలబెట్టడం వలన రోడ్ల వెంబడి చెట్లు అలాగే గడ్డివాములు కొన్ని ప్రాంతాలలో ఇల్లు అగ్ని ప్రమాదానికి గురి అవుతున్నాయి కావున రైతులు పొలాలలో గడ్డిని తగలబెట్టకుండా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది రఫీ, నాగార్జున, మోహన్, జగన్, నాయకులు భాషాబోయిన భాస్కర్, ఫైర్ సిబ్బంది జి శ్రీనివాసరావు, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఘనంగా భజరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాధుని శోభయాత్ర

TNR NEWS

నర్సరీల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

Harish Hs

మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ షేక్ బషీర్ కు కే ఎల్ ఎన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం

Harish Hs

రేషన్ డీలర్ల నూతన సంవత్సర క్యాలండర్ ఆవిష్కరణ 

TNR NEWS

*ఎమ్మార్పీఎస్, ఎం జె ఎఫ్ ఆధ్వర్యంలో 75 వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు*

Harish Hs

*స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.!!*

TNR NEWS