Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఓటు హక్కుపై బీజేపీ దాడి…. సర్ పేరుతో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు బీజేపీ కుట్ర ….  బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమం…..  సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి….

సూర్యాపేట:రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రజలు కాపాడుకోవాలని, సర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక ధ్రువీకరణ) పేరుతో మైనారిటీలు, దళితులు, ఆదివాసీల ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి ఆరోపించారు. బుధ వారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్టార్ బ్యాంక్ ఎట్ హాల్ రెండు రోజులపాటు జరిగే సిపిఐ ( ఎం )పార్టీ సూర్యాపేట జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతులను ఆమె ప్రారంభించి, మాట్లాడుతూధ్రువీకరణ పత్రాల లేమి కారణంగా పేద ప్రజలు ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకునే ప్రజాస్వామ్య విధానానికి బదులుగా ప్రభుత్వమే ఓటర్లను ఎంపిక చేసే పరిస్థితికి దేశాన్ని నెట్టివేస్తోందన్నారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య శక్తులన్నీ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తమ ఇష్టానుసారం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచుతుందని ఆరోపించారు. ఇప్పటికే యుద్దాల మూలంగా ప్రజలపై బారాలు పడి ఇబ్బంది పడుతున్న ప్రజలపై మునిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఇంధన ఆయిల్ ధరలు పెంచడం సమంజసం కాదన్నారు. ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు ఎలాంటి గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచమని చెప్పి రోజు విడిచి రోజు పెంచడంలో అర్థం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్న నేటికీ ఇచ్చిన హామీని అమలు చేయలేదని ఆరోపించారు. మహిళలకు 2500, వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 12,000, గ్యాస్ సబ్సిడీ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వంటి హామీలు అటకెక్కించారని విమర్శించారు.

*రైతు డిస్కం ను ఉపసంహరించుకోవాలి.*

*సిపిఐ ( ఎం)రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి.సాగర్*

రైతుల పొలాల్లో విద్యుత్ మీటర్ల ఏర్పాటు, విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం రైతు డిస్కంను తీసుకొచ్చిందన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతు డిస్కం ద్వారా రైతులు, పేద ప్రజలకు అందుతున్న విద్యుత్ సబ్సిడీలను ఎత్తివేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను ముందుగానే అందుబాటులో ఉంచాలని, నాణ్యమైన వ్యవసాయ ఇన్‌పుట్ల సరఫరాకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసి బ్యాంకు రుణాలు అందేలా చూడాలని డిమాండ్ చేశారు. కార్మికులు అనేక పోరాటాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడు లుగా విభజించి కార్మికులకు నష్టం కలిగించే చర్యలకు బిజెపి ప్రభుత్వం పూనుకుంటుందని విమర్శించారు. దీని మూలంగా దేశంలోని కోట్లాదిమంది కార్మికులు తమ హక్కులను కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చి వీబిజీరాంజి పేరుతో నూతన బిల్లును తీసుకువచ్చారని ఆరోపించారు. ఈ బిల్లు అమలు అయితే కోట్లాదిమంది ఉపాధి కూలీలు ఉపాధి హామీ పనులకు దూరం అయ్యే పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టం వల్ల అనేక కుటుంబాలలో వెలుగులు ప్రసరిల్లాయని అన్నారు. రెండు పూటలా ఫోటో విధానాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. వడదెబ్బ బాధితులకు ప్రభుత్వం 10 లక్షల రూపాయలు చెల్లించాలన్నారు.

ఈ శిక్షణ తరగతుల ప్రారంభ సూచికంగా సిపిఎం పతాకాన్ని పార్టీ సీనియర్ నాయకులు బొమ్మిడి లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ప్రిన్సిపాల్ గా వ్యవహరించిన ఈ శిక్షణ తరగతులలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, మండల, పట్టణ శాఖ కార్యదర్శిలు, సిపిఎం మండల, పట్టణ కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శులు పాల్గొన్నారు.

Related posts

ఆపదలో ఉన్నవారికి కాకతీయ సేవా సమితి అండగా ఉంటుంది

TNR NEWS

షార్ట్ సర్క్యూట్ తో మీసేవ దగ్ధం

TNR NEWS

మట్టి వినాయకుణ్ణి పూజించండి… పర్యావరణాన్ని కాపాడండి – పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా

Dr Suneelkumar Yandra

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి

TNR NEWS

రైతులపై దాడులకు పాల్పడిన వారిపై చర్య తీసుకోవాలి.  రైతాంగం పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి.  రైతాంగానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి ఎస్కేయం డిమాండ్

TNR NEWS

జాతీయస్థాయిలో అవార్డు అందుకున్న తమలపాకుల సైదులు.

Harish Hs