Tnrnews.in
తెలంగాణ

క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి ద్రోహదపడతాయి. :గ్రామీణ ప్రాంతాలలో క్రీడాకారులను వెలికి తీయడానికి ఈ క్రీడలు ఉపయోగపడతాయి డీఎస్పీ శ్రీనివాసరెడ్డి 

కోదాడ : క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి ద్రోహదపడతాయని డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని తొగర్రాయి గ్రామంలో యలమర్తి అంబేద్కర్( కానిస్టేబుల్) ఆధ్వర్యంలో టిపిఎల్ లీగ్ క్రికెట్ సీజన్ 2 టోర్నమెంట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఎస్పి శ్రీనివాసరెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ గ్రామంలో ఉన్న ప్రతి యువతి, యువకులు క్రీడారంగానికి ప్రాధాన్యత ఇస్తూ, రకరకాల క్రీడల్లో పాల్గొంటూ భవిష్యత్తులో జాతీయస్థాయిలో గుర్తింపు పొందుటకు ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొని ఈ గ్రామానికి, ఈ రాష్ట్రానికి ఈ దేశానికే మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలని అన్నారు. క్రీడలతోపాటు కష్టం అనుకోకుండా ఇష్టంతో చదివి మంచి ఉన్నత స్థాయి ఉద్యోగాలుసంపాదించి కన్న తల్లిదండ్రులకు చదువు నేర్పిన గురువులకు జన్మనిచ్చిన గ్రామానికి

ఆదర్శంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఉపసర్పంచి అమరబోయిన ఉమామహేశ్వరి శ్రీనివాస్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పులి సులోచన రావు, 8వ వార్డు నెంబర్ కొండపల్లి నాగమ్మ లచ్చయ్య, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు యలమర్తి రాము, కొండపల్లి ఆంజనేయులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు యలమర్తి శౌరి, బిఆర్ఎస్ మండల పార్టీ నాయకులు బాలేబోయిన వేలాద్రి, బాలే బోయిన వెంకన్న, కత్తుల భగత్, మాజీ వార్డ్ నెంబర్ కనకరత్నం ఆదాం, తొగర్రాయి గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొండపల్లి బిక్షం, క్రికెట్ టీం కెప్టెన్ మంద నరసింహారావు, చుక్క పుల్లారావు, అమరబోయిన శ్రీహరి, శీలం నవీన్, దాసరి నాగేంద్రబాబు, క్రికెట్ టీం సభ్యులు, క్రీడాభిమానులు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ముగిసిన రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్

Harish Hs

జిల్లా స్థాయి గణిత ప్రతిభ పరీక్ష విజయవంతం……  తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రతిభ పరీక్ష..

TNR NEWS

పల్లె గ్రామాల్లో ఘనంగా ఎలా మాస పండుగా

TNR NEWS

హీరో శ్రీరామ్ నిమ్మల పుట్టినరోజు సందర్భంగా “సర్కారు బాయి” సినిమా పోస్టర్ రిలీజ్

TNR NEWS

ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు బజరంగ్ సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బహుమతులు

TNR NEWS

రేపటి నుంచే పాఠశాలలు ప్రారంభం

TNR NEWS