కోదాడ పట్టణంలోని విజయ గణపతి దేవాలయం 20వ వార్షికోత్సవం ఆలయ అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో శుక్రవారం భక్తజన సమూహంలో కనుల పండువగ నిర్వహించారు. ఆలయ వేద పండితులు ఉదయం తెల్లవారుజామునండి స్వామివారికి పంచామృత అభిషేకాలు జరిపి తిరొక్క పూలతో అలంకరించారు. ఈ సందర్భంగా పట్టణ నలుమూలల నుండి తరలి వచ్చిన భక్తులు సిద్ధి బుద్ధి సమేత విజయ గణపతి కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భారీగా తరలివచ్చిన భక్తులకు అన్నదానాన్ని కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి కృష్ణయ్య, చలపటి శివ, ఓరుగంటి బ్రహ్మం, చలపాటి రామారావు, వంగవీటి లక్ష్మణ్ రావు, గోపారపు ఉపేందర్, మేకల నరేష్, తుంగతుర్తి శేషగిరిరావు, ఓరుగంటి నవీన్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు…..

previous post