Tnrnews.in
తెలంగాణ

ప్రభుత్వ పథకాలపై కళాకారుల ఆటపాట వివిధ గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్న కళాకారులు

మద్దూర్ డిసెంబర్ 03 (TNR NEWS) : ప్రభుత్వ పథకాలపై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఆటపాట”

ప్రభుత్వ సంక్షేమ పథకాలపై తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ఆరు గ్యారంటీ ల గురించి ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశానుసారం డిపిఆర్ఓ రషీద్ ఆధ్వర్యంలో సాంస్కృతిక సారథి కళాకారులు మంగళవారం ఉదయం మద్దూరు మండలంలోని మోమినాపూర్ రేణివట్ల యాదవరావుపల్లి గ్రామాలలో ప్రభుత్వ పథకాలపై ప్రజలకు ఆటపాటల ద్వారా అవగాహన కలిగించారు. రైతు రుణమాఫీ ఆరోగ్యశ్రీ 500 కే గ్యాస్ సిలిండర్ 200 యూనిట్లు ఉచిత కరెంటు రైతు కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతి గింజకు మద్దతు ధర రైతులకు 500 బోనస్ అందిస్తామని ప్రజలకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సారథి కళాకారులు రవిశంకర్ కిరణ్ నరసింహ బాలయ్య లక్ష్మి అరుణ జ్యోతి సుగుణ ఆయా గ్రామాల పంచాయతీ సెక్రటరీలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

*నేడు ఎక్సైజ్ స్టేషన్‌లో ద్విచక్ర వాహనాల వేలం పాట*

TNR NEWS

అత్యవసర సేవలకు అంతరాయం.. వెల్లుల్ల రోడ్డు

TNR NEWS

*పంచాయతీ ఎన్నికలపై సర్కార్ కసరత్తు.. జనవరి 14న నోటిఫికేషన్.. ఎన్నికలు ఎప్పుడంటే..!!*

TNR NEWS

లోక కళ్యాణమే అందరి అభిమతం ● సెమీ క్రిస్మస్ వేడుకల్లో కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జ్ పామేన భీమ్ భరత్

TNR NEWS

ఎంపీ ప్రియాంక గాంధీకి క్షమాపణ చెప్పాలి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఉమ్మడి రవి

TNR NEWS

జాతీయ రహదారిపై ట్రాక్టర్ బోల్తా – వ్యక్తి మృతి

TNR NEWS