Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర అగ్నిప్రమాదం

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్‌ మెల్టింగ్‌ స్టేషన్‌-2లో లిక్విడ్‌ స్టీల్‌ను తరలిస్తున్న సమయంలో ల్యాడల్‌ నుంచి హాట్‌మెటల్‌ బకెట్లు కుప్పకూలడంతో ప్రమాదం సంభవించింది. మరుగుతున్న స్టీల్‌ కార్మికులపై పడటంతో 9 మంది కార్మికులు సజీవ దహనమైనట్లు సమాచారం. ఇప్పటివరకు నలుగురు మృతదేహాలను గుర్తించిన అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

లిక్విడ్‌ స్టీల్‌ ద్వారా బీమ్స్‌ తయారు చేసే ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు కార్మికులు తెలిపారు. ప్రమాద సమయంలో సుమారు 150 టన్నుల లిక్విడ్‌ స్టీల్‌ ఉన్నట్లు సమాచారం. లాడల్‌ బ్లాస్ట్‌ కావడం ఇదే తొలిసారి అని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఘటనాస్థలిలో మంటలు ఆర్పేందుకు ఫైర్‌ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కృష్ణ ఆయకట్టులో ఈసారి వానాకాలం వరిపంటకు నీళ్లు విడుదల అయ్యే అవకాశాలు లేవు.

TNR NEWS

బైరెడ్డిపల్లి గ్రామ సచివాలయం 1 ను సందర్శించిన చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ గోవిందప్ప శ్రీనివాసులు@వాసు .

TNR NEWS

TNR NEWS

హోం మంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా అపోలో చెస్ట్ పెయిన్ క్లినిక్’ ప్రారంభం

TNR NEWS

పత్తిమిల్లు తూకంలో తేడాలు

TNR NEWS

రైతులు అందోళన చెందవద్దు – మాజీ ఎమ్మెల్యే వర్మ

Dr Suneelkumar Yandra