Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

57వ జాతీయ వారోత్సవాలకు హాజరైన సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్

 

సూర్యాపేట పట్నంలోని గ్రంథాలయంలో 57వ జాతీయ వారోత్సవాల భాగంగా మాజీ ప్రధానమంత్రి కీర్తిశేషులు ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి హాజరైన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ *శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్* తో పాటు సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ *వంగవేటి రామారావు* మరియు ఉమ్మడి నల్లగొండ జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి *బాలమ్మ* ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని మూడో స్థానంలో నిలిచిన గ్రంథాలయం సూర్యాపేట జిల్లా గ్రంథాలయం అని అన్నారు. ఐదు పుస్తకాలతో ప్రారంభమైన లైబ్రరీ వేల పుస్తకాలతో కొనసాగుతూ ఎంతోమంది పేద విద్యార్థులకు పుస్తకాలను అందిస్తున్న గ్రంథాలయం సూర్యాపేట గ్రంధాలయం అని అన్నారు. అదేవిధంగా నూతన గ్రంథాలయ భవనానికి కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేసి గ్రంథాలయ భావన నిర్మాణాన్ని ప్రారంభించే విధంగా చేయాలని గ్రంథాలయ చైర్మన్ కి తెలియజేశారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా గ్రంథాలయంలో ఎంతోమంది విద్యార్థులు చదువుకొని ప్రభుత్వ ఉద్యోగస్తులు పొందారు అని అన్నారు. ఈరోజు ఈ గ్రంథాలయం ఇలా అభివృద్ధి చెందడానికి ప్రధానమైన కారణం మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు *శ్రీ గుంటకండ్ల జగదీశ్ రెడ్డి* అని అన్నారు.పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి ఇబ్బందికరంగా ఉంది అని తెలిసిన వెంటనే తన సొంత నిధులలో నుంచి 15 లక్షల రూపాయలు కేటాయించి విద్యార్థులకు మధ్యాహ్న భోజనము సాయంకాలం స్నాక్స్ ఏర్పాటు చేసిన మాజీ విద్యుత్ శాఖ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు *శ్రీ గుంటకండ్ల జగదీశ్ రెడ్డి* గారికి దక్కుతుంది అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన కాంచి గ్రంధాలయాలకు ఎంతో ప్రాధాన్యత కల్పించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు. ఆగినటువంటి మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని తిరిగి పునర ప్రారంభించాలి అని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో జడ్.పి.హెచ్.ఎస్ బాయ్స్ స్కూల్ హెడ్మాస్టర్ పద్మ, స్ఫూర్తి లైన్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీదేవి, హైమావతి, ఇతర మహిళా మణులు పాల్గొన్నారు.

Related posts

అక్టోబర్ నాటికి రెడ్లకుంట లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలి

Harish Hs

మిషన్ తో కట్ చేస్తున్న చెట్టు కొమ్మ మీద పడి వ్యక్తి మృతి

Harish Hs

చీమలపేటలో ముగ్గుల పోటీల కార్యక్రమానికి ముఖ్యఅతిథి పాల్గొన్న..పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్…

TNR NEWS

దివ్యాంగులకు ట్రై సైకిల్లు పంపిణీ…

TNR NEWS

జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన  విద్యార్థిని పవిత్రకు బిజెపి గజ్వేల్ పట్టణ శాఖ తరపున సన్మానం 

TNR NEWS

అఖిలపక్ష సమావేశం

Harish Hs