సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో సూర్యాపేట జిల్లా సమాచార హక్కు రక్షణ చట్టం-2005 సంవత్సర నూతన క్యాలెండర్ ను “సూర్యాపేట జిల్లా ఆదనపు కలెక్టర్” పి . రాంబాబు ఆవిష్కరణ చేసినారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం 2005 ప్రజలకు ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ చట్టం ద్వారా తెలుసుకోవచ్చని, ప్రజలు కావలసిన ఇలాంటి సమాచారాన్ని తెలుసుకోవచ్చని, ప్రజల కు ఇది వజ్రాయుధంలాంటిదని, పార్టీ ఏ కార్యకర్తలు ప్రజలకు ప్రభుత్వ అధికారుల మధ్య వారధి లాగా పని చేస్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి తెలిసేలాగా అవగాహన సదస్సులు,చట్టాల పైన అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. అనంతరం కలెక్టరేట్లోని అన్ని కార్యాలయాలకు సమాచార హక్కు రక్షణ చట్టం 2005 క్యాలెండర్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రటరీ నెమ్మాది వెంకటేశ్వర్లు, యాద్రాద్రి జోనల్ (నల్లగొండ -యాదాద్రి-సూర్యపేట జిల్లాలు) ఇంచార్జి వంగవీటి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు గోవిందా నవీన్,జిల్లా కో- ఆర్డినేటర్ దేవపంగు విఖిల్,జిల్లా జాయింట్ సెక్రటరీ కడప పెంటయ్య, జిల్లా ఉపాధ్యక్షులు జే. వెంకన్న, కోదాడ మండలం అధ్యక్షులు బాలెబోయిన రామారావు, మునగాల మండల అధ్యక్షులు తాళ్ళపాక వినోద్, చిలుకూరు మండల అధ్యక్షులు నూకపంగు వినోద్, నడిగూడెం మండల అధ్యక్షులు మాతంగి సురేష్,జిల్లా సభ్యులు దేవపంగు ప్రసాద్ మొదలగువారు పాల్గొన్నారు…