Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
సినిమా వార్తలు

‘ది రాజా సాబ్’ నుండి కీలక అప్ డేట్

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమా నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చేసింది. హారర్ కామెడీ జానర్‌లో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి మొదటి పాట విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌కు ‘రెబల్ సాబ్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుపుతూ.. ఈ పాటను ఎల్లుండి విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తుండటంతో పాటలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటులు సంజయ్ దత్, బోమన్ ఇరానీతో పాటు జరీనా వహాబ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Related posts

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ ఎలా ఉందో చూద్దాం రండి

TNR NEWS

మార్చి 7న విడుదల కానున్న ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’

TNR NEWS

బాలయ్యపై సంయుక్త మీనన్ ప్రశంసల వర్షం

TNR NEWS

కిరణ్ రెడ్డి తుమ్మ సినీ ప్రయాణం యువతకు ఆదర్శం కావాలి

TNR NEWS

ప్రభాతో జట్టుకట్టడంపై స్పందించిన అనిల్ రావిపూడి

TNR NEWS

పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు ‘అర్జున’ టైటిల్!

TNR NEWS