Tnrnews.in
తెలంగాణ

పూర్వ విద్యార్థులు సేవా గుణం అలవర్చుకోవాలి  – ఘనంగా ఎండ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గురువై విద్యార్థుల సమ్మేళనం   నాటి జ్ఞాపకాలు పంచుకొని ఆడి పాడి పొద్దంతా ఆనందంగా గడిపిన స్నేహితులు

పూర్వ విద్యార్థులు సేవా గుణం అలవర్చుకొని సమాజంలో నిరుపేద విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఆనాటి గురువులు తమ పూర్వ విద్యార్థులకు పిలుపునిచ్చారు. సూర్యాపేట మండల పరిధిలోని ఎడ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2002- 03 పదో తరగతి విద్యార్థుల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివార సూర్యపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ గ్రాండ్ హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్నేహితులు ఆనాటి జ్ఞాపకాలు పంచుకొని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని పొద్దంతా ఆడి పాడి సందడి చేశారు. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ నాటి గురువులు మాకు బోధించిన విలువలు సమాజంలో మాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి అన్నారు. నేడు గురువులు సూచించినట్లుగా పూర్వ విద్యార్థులుగా తాము ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి నిరుపేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం నాడు తమకు చదువు చెప్పి న గురువులు కే వెంకట్ రెడ్డి, మాధవరెడ్డి, సుదర్శన్ రెడ్డి, కృష్ణమూర్తి, రేణుక లను పూలమాలలు శాలువాలు మేమెంటోలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన ఆర్గనైజర్స్ దాసరి సైదులు, కొలిశెట్టి రమేష్ పాలడుగు శైలజ, జానకి, సంగు మహేష్, తూడి నగేష్, పాపయ్య, నరసింహారావు, ఎండ్లపల్లి, రామారం పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సురవరం సుధాకర్ రెడ్డి మృతి భారతదేశానికి తీరనిలోటు

Harish Hs

బీసీలను మోసం చేసే పార్టీలకు పుట్టగతులుండవు

TNR NEWS

ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న (04 ) ట్రాక్టర్లను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

TNR NEWS

లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కిన ఆర్ఐ

Harish Hs

ఏఎస్ఐ గా పదోన్నతి పొందడం సంతోషకరం కోదాడ యూనైటెడ్ పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు రివరెండ్ వి యేసయ్య 

TNR NEWS

వార్షిక తనిఖీల్లో భాగంగా చింతలమానపల్లి పోలీసుస్టేషన్ ను తనిఖీ…  కాగజ్నగర్ డిఎస్పి రామానుజం… పెండింగ్ కేసులను వీలైనంత తొందరగా పరిష్కరించాలి….

TNR NEWS