Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఎస్ డబ్ల్యూ ఎఫ్ తోనే ఆర్టీసి కార్మికులకు న్యాయం   సూర్యాపేట డిపో విస్తృత స్థాయి సమావేశంలో రీజియన్ కార్యదర్శి బత్తుల సుధాకర్  ఎస్ డబ్ల్యూ ఎఫ్ లో పలువురు కార్మికుల చేరిక

సూర్యాపేట :కార్మికుల వారధి -పోరాటాల సారథి స్టాఫ్ & వర్కర్స్ ఫెడరేషన్ ద్వారానే కార్మికులకు న్యాయం జరుగుతుందని ఆర్టీసీ పట్ల,, కార్మికుల సమస్యల పట్ల స్పష్టమైన అవగాహనతో,సమస్యల పరిస్కారం కోసం ముందుకు వెళుతున్న సంఘం ఎస్ డబ్ల్యూ ఎఫ్ దేనని స్టాఫ్ & వర్కర్స్ ఫెడరేషన్ రీజియన్ అధ్యక్షా,కార్యదర్శులు కందుల నరసింహ, బత్తుల సుధాకర్ అన్నారు

స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన డిపో విస్తృత స్థాయి సమావేశంలో వారు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం సంస్థ రక్షణ కోసం ఎస్ డబ్ల్యూ ఎఫ్ రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళుతుందని కార్మికుల హక్కుల కోసం రాజీలేని పోరాటం కొనసాగిస్తున్నామని నీతి నిజాయితీ గల సంఘానికి కార్మికులు మద్దతుగా నిలవాలని వారు పిలుపునిచ్చారు

ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భద్రత కోసం ఎన్నో సంవత్సరాల నుండి ఎస్ డబ్ల్యూ ఎఫ్ కృషి చేస్తు అనేక సదస్సులు నిర్వహించి ప్రభుత్వానికి,యాజమాన్యానికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోర్టు దాక వెళ్లిన సంఘం తమదేనని అన్నారు,, ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో పర్యటన చేసి కార్మికులకు వచ్చే లాభనష్టాలను అధ్యయనం చేసి విలీన బుక్లెట్ ని ముద్రించామని ప్రతి కార్మికులు ఈ బుక్లెట్ ని చదివి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు,, ఆర్టీసీలోని కొన్ని క సంఘాలు గుడ్డిగా విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నాయని కార్మికులకు జరిగే లాభనష్టాలను అధ్యయనం చేయకుండా ఉంటేవిలీనం కంటే వున్న సమస్యలు పరిష్కరించకుండా వెళ్తుండడం విడ్డూరమని అన్నారు..

గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు యూనియన్ లేవని నిషేధించిన సందర్భంగా ఏ ఒక్క యూనియన్ కార్మికుల కష్టాలను పట్టించుకోకుండా ఈ ప్రభుత్వ హయాంలో జరిగిన సమ్మె సందర్భంగా జరిగిన చర్చల్లో భాగంగా యూనియన్లను పునరుద్ధరిస్తామని ఎన్నికల నిర్వహిస్తున్నామని చెప్పిన సందర్భంలో ముందుకు వస్తున్నాయని మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకొని గుర్తింపు లోకి రావాలని చూస్తున్నాయని అన్నారు,, పదేళ్లపాటు గుర్తింపులో ఉన్న సంఘాలు కార్మికులను తీవ్రమైన అన్యాయం చేశాయని రెండు పీఆర్సీలను ఎగ్గొట్టాయని ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని ఎన్నికల్లోకి వస్తారని కార్మికులు అంటున్నారని అన్నారు

కార్మిక శ్రేయస్సు కోసం కార్మికుల హక్కుల రక్షణ కోసం సంస్థ పరిరక్షణ కోసం మొదటి నుండి కృషి చేస్తున్నది ఎస్ డబ్ల్యూ ఎఫ్ అని కార్మికులందరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు

ఈ సమావేశంలో వివిధ సంఘాల నుండి పలువురు కార్మికులు ఎస్ డబ్ల్యూ ఫ్ లో చేరినారు,, చేరిన వారిలో కార్మిక నాయకులు నాగరాజు,, లింగయ్య,, వెంకన్న తదితరులు ఉన్నారు

ఈ సమావేశంలో రీజియన్ సహాయ కార్యదర్శి శ్యాం సుందర్, రీజియన్ ఉపాధ్యక్షులు గుండు రమేష్, కోదాడ డిపో కార్యదర్శి సోమయ్య,డిపో అధ్యక్ష, కార్యదర్శులు రవి, లక్ష్మయ్య, మహిళ కన్వీనర్ యాకమ్మ,ఎలేంద్ర, డిపో కోశాధికారి వేల్పుల వెంకన్న,ఎస్ ఎం రెడ్డి,మర్యాద వెంకన్న, శంకర్, వీరసోములు, వెంకన్న, అజయ్,ప్రవీణ్ కుమార్,శంకరయ్య,రంగు. వెంకన్న, శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు

Related posts

తహసిల్దార్ కార్యాలయంలో ఫైర్ పై అవగాహన  :ఫైర్ ఫై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి  : తహసిల్దార్ సంతోష్ కిరణ్

TNR NEWS

జానకి రామ్ ను సన్మానించిన కోదాడ రచయితల సంఘం

Harish Hs

అట్టహాసంగా మునగాల విజ్ఞాన మహోత్సవం

TNR NEWS

రావి చెట్టును రక్షించాలంటూ కార్యదర్శికి వినతిపత్రం

TNR NEWS

భానుపురి క్రాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా పిడమర్తి మధు టపాసు దుకాణదారులకు అధికారులు,ప్రజలు సహకరించాలి

TNR NEWS

తుర్కపల్లి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక. అర్హులకు అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తారు..  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.. హరి నారయణ గౌడ్

TNR NEWS