ఇందిరమ్మ రాజ్యం దేశానికి ఆదర్శమని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంజద్ అలీ, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ అన్నారు.మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఎన్నికై దేశానికి ఎనలేనని సేవలు చేసి, దేశవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇల్లు నిర్మించి, భూమి లేని నిరుపేదలకు భూములు పంచి నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా ఇందిరమ్మగా నిలిచిపోయిందని ఆమె సేవలను కొనియాడారు. పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఉక్కు మహిళ వీర వనిత గరీబ్ హటావో నినాదంతో పేదరికాన్ని తొలగించి దేశాన్ని రక్షించండి అనే నినాదంతో పిలుపునిచ్చి అన్ని రంగాల అభ్యున్నతికి కృషి చేశారని అన్నారు.ఈ కార్యక్రమంలో వీరన్న నాయక్, అబ్దుల్ రహీం,తంగెళ్ల కరుణాకర్ రెడ్డి,కుమ్మరికుంట్ల వేణుగోపాల్,ఎలిమినేటి అభినయ్, సిరివెళ్ల శభరినాధ్,గండూరి రమేష్,నాగుల వాసు,రుద్రంగి రవి,సాయి నేత,గడ్డం వెంకన్న, అన్నమయ్య రాము,కోడి శివ,ఆలేటి మాణిక్యం, రావుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.