మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలను మంగళవారం మండల ఎంఈఓ పిడతల వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు ఉపాధ్యాయుల విద్యార్థుల హాజరు రిజిస్టర్లను,విద్యార్థుల తెలుగు, ఇంగ్లీషు గణిత, సామర్థ్యాలను,మధ్యాహ్న భోజన పథకమును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినారు.టిఎల్ఎం మెటీరియల్ ని ఉపయోగించి బోధన గావించడం విద్యార్థుల అభ్యసన అభివృద్ధికి దోహాదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమములో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు వక్కంతుల భరత్ బాబు ఉపాధ్యాయురాలు ఎం .లక్ష్మీ పాల్గొన్నారు.