తొర్రూర్ డివిజన్ :
మహబూబాబాద్ జిల్లా,తొర్రూర్ మండలం అమ్మాపురం ప్రాథమిక పాఠశాలలో బాల దినోత్సవం కార్యక్రమం లో భాగంగా అమ్మాపురం గ్రామస్తులు విద్యార్థులకు మిఠాయిల పంపిణి చేయడం జరిగింది. పిల్లలను చదువు లో ప్రోత్సాహించాలనే ఉద్దేశ్యం తో,బాల దినోత్సవం రోజున పిల్లలు సంతోషంగా ఉండాలని,మిఠాయిలు, బిస్కెట్స్ పంపిణి కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా వారు చిన్నారులతో కొంతసేపు ముచ్చటించడం జరిగింది. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. పిల్లల యోగ క్షేమాలు చూసుకోవడం ఒక్క తల్లి తండ్రుల భాద్యత మాత్రమే కాదు సమాజంలోని విద్యా వేత్తలు, గ్రామ పెద్దలు, యువజన సంఘాలు కూడా ముందుకు రావాలని చెప్పడం జరిగింది.పాఠశాల ప్రధానోపాధ్యాయులు యకూబ్ రెడ్డి మాట్లాడుతూ… జవహర్ లాల్ నెహ్రు యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని ఈ నవంబర్ 14 వ తేదీని మనమందరం బాలల దినోత్సవం గా జరుపుకుంటాం అని పిల్లల కు చెప్పడం జరిగింది. అమ్మాపురం గ్రామస్తులు ఈ బాలల దినోత్సవం లో పాలుపంచుకోడం సంతోషం గా ఉందన్నారు. తదనంతరం చిన్నారులకు బాల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు అమ్మాపురం గ్రామస్తులు పాల్గొన్నారు.