Tnrnews.in
తెలంగాణ

SIR’ ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తేనే ఓటరు జాబితాలో పేరు: సీఈఓ సుదర్శన్ రెడ్డి_

_తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEO) సి. సుదర్శన్ రెడ్డి కీలక స్పష్టతనిచ్చారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ వినూత్న సవరణ ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ అధికారులు (BLO) పంపిణీ చేసే ‘ఎన్యూమరేషన్ పత్రాన్ని’ పూర్తిగా నింపి సమర్పిస్తేనే రాబోయే డ్రాఫ్ట్ (ప్రాథమిక) ఓటర్ల జాబితాలో పేరు కొనసాగుతుందని స్పష్టం చేశారు._

 

_అర్హులైన ఓటర్లను గుర్తించి, బోగస్ ఓట్లను తొలగించేందుకు దాదాపు 24 ఏళ్ల తర్వాత (చివరిగా 2002లో జరిగింది) చేపట్టిన ఈ భారీ కసరత్తులో ప్రతి ఓటరు భాగస్వామ్యం కావడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల జూలై 31న విడుదలయ్యే డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో క్లెయిమ్‌లు, అభ్యంతరాల గడువులోగా ‘ఫామ్-6’ ద్వారా కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు._

 

_హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ వంటి ప్రధాన పట్టణ ప్రాంతాల్లో బీఎల్వోలు ఇళ్లకు రావడం లేదని, ఎన్యూమరేషన్ పత్రాలు ఇవ్వడం లేదంటూ మీడియా ప్రతినిధులు లేవనెత్తిన ప్రశ్నలపై సీఈఓ సీరియస్‌గా స్పందించారు. బీఎల్వోలు తప్పనిసరిగా ప్రతి ఇంటికీ వెళ్లి ఫామ్‌లను స్వయంగా అందజేసి, ఓటర్ల వివరాలు సేకరించాలని, ఇందులో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని కరాఖండిగా ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లోని లోపాలను సరిదిద్దేందుకు పర్యవేక్షకులను (Supervisors) రంగంలోకి దించామని, హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆన్‌లైన్ ద్వారా కూడా ఎన్యూమరేషన్ పూర్తి చేసే అవకాశం ఉందని, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును భద్రపరుచుకునేలా అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని సుదర్శన్ రెడ్డి ఆదేశించారు._

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

క్రీడలు మానసిక ఉల్లాసానికి ప్రతీకలు

Harish Hs

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

TNR NEWS

గ్యార్మి ఉత్సవాల్లో పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్ చంద్రారెడ్డి 

TNR NEWS

తెలంగాణ జర్నలిస్టులకు సీఎం రేవంత్‌రెడ్డి షాక్‌ ! – కొనసాగుతున్న సమీక్ష సమావేశం  – మళ్ళీ అధికారంలోకి వస్తేనే ఇండ్ల స్థలాలు  – ఇప్పట్లో ఇచ్చేది లేదంటూ పరోక్షంగా వెల్లడి

TNR NEWS

బాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే కార్యక్రమం. గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 23 ఫిర్యాదులు స్వీకరణ. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.

TNR NEWS

విగ్రహావిష్కరణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి……..  అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే……..

TNR NEWS