Tnrnews.in
తెలంగాణ

*”కల్యాణలక్ష్మి” అమల్లో కీలక మార్పులు, ఇక నుంచి – మార్గదర్శకాలు..!!

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమల్లో కీలక మార్పులకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కొత్త ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి. ఈ పథకం కింద ఇక నుంచి చెక్కులు కాకుండా నేరుగా అర్హత ఉన్న లబ్దిదారుల ఖాతాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ పథకం కింద నిధులు జమ చేయాలని భావిస్తున్నారు. లబ్దిదారుల ఎంపిక.. ఆమోదం కోసం కొత్త విధానం అందుబాటులోకి తీసుకురానుంది.

తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమల్లో కొత్త విధానం అమలు చేసేందుకు సిద్దం అవుతోంది. ఇప్పటి వరకు ఈ పథకాల కింద లబ్దిదారులకు చెక్కుల రూపంలో అందిస్తున్న రూ.1,00,116 ఆర్థిక సాయాన్ని ఇకపై నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ఆలోచన చేస్తోంది. ఈ రెండు పథకాలకు డీబీటీ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. లబ్దిదారులు తమ దరఖాస్తు ఆన్ లైన్ లో చేసేందుకు వీలుగా కొత్త పోర్టల్ ను తీసుకొస్తోంది. అదే విధంగా ఆమోద ప్రక్రియను ఆన్ లైన్ విధానంలోనూ పూర్తి చేయనుంది. దీని ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు ఉన్న లబ్దిదారులకు వగంగా పథకం నిధులు జమ అయ్యే విధంగా మార్పులు తీసుకొస్తోంది. ప్రస్తుతం ఎమ్మార్వో, ఆర్డీవో స్థాయిలో వెరిఫికేషన్ ఆలస్యం కావడంతో వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

తెలంగాణ అభ్యర్థులు బిగ్ అలర్ట్.. గ్రూప్‌ 4 ఫలితాలు విడుదల..

TNR NEWS

నిర్మల్ నగర్ లో ఘనంగా జరిగిన కెసిఆర్ జన్మదిన వేడుకలు    – కెసిఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ

TNR NEWS

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన..మాజీ సర్పంచ్ దారబోయిన నర్సింహ యాదవ్

TNR NEWS

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుల

TNR NEWS

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తుల సమస్యలను సత్వరం పరిష్కరించాలి – పి డి ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ డిమాండ్

TNR NEWS

TNR NEWS