Tnrnews.in
తెలంగాణ

పెద్ద అంబర్‌పేటలో నకిలీ డీఏపీ తయారీ ముఠా గుట్టురట్టు.! సీఐ చరమంద రాజు చాకచక్యంతో వెలుగులోకి వచ్చిన నకిలీ ఎరువుల దందా..! రూ. ఒక కోటి 50 లక్షల విలువైన వెయ్యి బస్తాలు స్వాధీనం…. ! పరారీలో నిందితులు….!

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు నేతృత్వంలో పోలీసులు చేపట్టిన దాడులతో పెద్ద అంబర్‌పేటలో నిర్వహిస్తున్న నకిలీ డీఏపీ ఎరువుల తయారీ ముఠా గుట్టురట్టైంది. సుమారు రూ. ఒక కోటి 50 లక్షల విలువైన 1,000 నకిలీ డీఏపీ బస్తాలను స్వాధీనం చేసుకోగా, పోలీసుల రాకను గమనించిన నిందితులు పరారయ్యారు.

సీఐ చరమంద రాజు తెలిపిన వివరాల ప్రకారం, సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ రైతు నకిలీ డీఏపీ కొనుగోలు చేసిన ఘటనపై మఠంపల్లి మండలంలో నమోదైన కేసు విచారణలో కీలక ఆధారాలు లభించాయి. ఆ దర్యాప్తును విస్తరించిన పోలీసులు పెద్ద అంబర్‌పేటలోని గోదాముపై మెరుపు దాడి నిర్వహించారు.

తనిఖీల్లో సాల్ట్, గ్రోమోర్, కోరమండల్, అన్నపూర్ణ తదితర ప్రముఖ కంపెనీల పేర్లతో ఉన్న ఖాళీ సంచుల్లో ఉప్పు, మట్టి తదితర నాసిరకం పదార్థాలను రసాయనాలతో కలిపి డీఏపీగా తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

నాగర్ కర్నూలు జిల్లా…. వాటర్ ఫాల్స్ కనువిందు

TNR NEWS

కోదాడ అభివృధే ఉత్తమ్ దంపతుల ద్వేయం

TNR NEWS

సురవరం సుధాకర్ రెడ్డి మృతి భారతదేశానికి తీరనిలోటు

Harish Hs

వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు 

Harish Hs

వృద్ధాశ్రమంను ప్రారంభించిన ఎమ్మెల్యే

TNR NEWS

కోదాడ పట్టణంలో ఘనంగా బోనాల పండుగ

Harish Hs