ఓదెల పెద్దపల్లి జిల్లా రామగుండం మహాత్మ జ్యోతిబా పూలే పాఠశాలలో ఏడవ తరగతి చదివే విద్యార్థి ఓదెల మండల కేంద్రానికి చెందిన అరకాల స్రవంతి తిరుపతి ల చిన్న కుమారుడు చదరంగంలో చిచ్చర పిడుగు చెస్ పోటీలో ఛాంపియన్ అరకాల సిద్ధార్థ శామీర్ పేట హైదరాబాదులో జరిగిన చదరంగం పోటీల్లో 150 మంది పాల్గొనగా రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి సాధించినాడు. సిద్ధార్థ కు పాఠశాలలో గురుకుల రాష్ట్ర కార్యదర్శి సైదులు చేతుల మీదుగా షీల్డ్ అందుకున్నాడు. ఇలాంటి షీల్డ్ మరెన్నో అందుకొని పెద్దపల్లి నియోజకవర్గానికి, ఓదెల మండలానికి మంచి పేరు తేవాలని పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అభినందించినారు. అలాగే ఓదెల గ్రామ మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ సిద్ధార్థ ను శాలువా కప్పి, స్వీట్లు పంపి ని చేసి అభినందించినారు.