Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

రణపంగ శ్రవణ్ పూలేకు గౌరవ డాక్టరేట్* *నేటి సామాన్యుడికి దక్కిన అరుదైన గౌరవం* *ప్రజా సమస్య పైన వివిధ సామాజిక కార్యక్రమాలకు చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం.*  *లయన్ డాక్టర్ ఆకుల రమేష్ చేతుల మీదుగా డాక్టరేట్ ప్రధానం* *ఈ గౌరవం నా ఒక్కడిది కాదు… నన్ను నమ్మిన ప్రతి ఒక్కరి విజయం*  *ఈ అవార్డు నాకు మరింత బాధ్యతను పెంచింది రణపంగ శ్రవణ్ పూలే

పెన్ పహాడ్ మండలం లింగాల గ్రామానికి చెందిన రణపంగా శ్రవణ్ పూలే అతి చిన్న వయసులోనే సామాజిక మరియు రాజకీయ వివిధ రంగాల్లో శక్తితో సమాజంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బహుజన విద్యార్థి నాయకుడు కవి గాయకుడు శ్రవణ్ కు అరుదైన గౌరవం దక్కింది. సామజిక సేవ ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ గౌరవ డాక్టరేట్ ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ఏషియన్ వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్పూర్తి అకాడమీ ఫౌండర్ & చైర్మన్ లయన్ డాక్టర్ ఆకుల రమేష్ చేతుల మీదుగా ప్రదానం చేయనున్నారు.

సమాజంలో జరుగుతున్న అన్యాయాలను వెలుగులోకి తీసుకురావడంలో, ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి చేర్చడంలో, బాధితులకు న్యాయం జరిగేలా నిరంతరం కృషి చేయడంలో శ్రవణ్ పాత్ర ప్రశంసనీయమని పలువురు పేర్కొంటున్నారు. స్థానిక ఎన్నికలలో యువత పాల్గొని డబ్బు లేని రాజకీయాలు చేయాలని ఎంతోమందికి స్ఫూర్తిదాయకాన్ని నింపిన చిన్న వయసులోనే పలు సేవా కార్యక్రమాలు విద్యార్థి మరియు ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాడుతూ ముందుకు సాగుతున్న అతని ఆలోచనలు ఎంతోమంది మెదడులో చైతన్యా రేకెత్తించాయి.

నిజాయితీ, నిష్పక్షపాత ధోరణి, సామాజిక బాధ్యతతో ఆయన ప్రజల నమ్మకాన్ని సంపాదించుకోవడం ఆయనకు లభించిన అతిపెద్ద బహుమతిగా భావిస్తున్నప్పటికీ, ఇప్పుడు లభించిన గౌరవ డాక్టరేట్ ఆయన సేవలకు అధికారిక గుర్తింపుగా నిలిచింది.

ఈ సందర్భంగా రణపంగా శ్రవణ్ పూలే మాట్లాడుతూ,

“ఈ గౌరవం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇది నా వ్యక్తిగత విజయమే కాదు, నన్ను నమ్మి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి అంకితంఅని ఈ అవార్డు నాకు మరింత బాధ్యతను పెంచింది. ఇకపై కూడా ప్రజల పక్షాన నిలబడి, నిజం కోసం నిర్భయంగా గళం విప్పుతాను అని అన్నారు.

సామాజిక చైతన్యం పెంపొందించడంలో, యువతలో అవగాహన కల్పించడంలో ఆయన పాత్ర విశేషమని మేధావులు అభిప్రాయపడ్డారు. సామాజిక సేవలకు గౌరవ డాక్టరేట్ అందుకోవడం అరుదైన ఘనతగా పేర్కొన్నారు.

మార్చి 10, 2026న ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సిటీ కల్చరల్ ఆడిటోరియంలో ఈ అవార్డు ప్రదానోత్సవం ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో లయన్ డాక్టర్ ఆకుల రమేష్, ఏషియన్ వేదిక్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ డాక్టర్ ఫిరోజ్ థామస్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు, ఫిలిం యాక్టర్ డాక్టర్ ఘర్షణ శ్రీనివాస్, ఫిలిం ప్రొడ్యూసర్ & డైరెక్టర్ డాక్టర్ మల్లం రమేష్, గూడూరి చెన్నారెడ్డి, డాక్టర్ ఆకుల మంజుల తదితర ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు.

సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు తమ కృషి, సేవా భావం, నిబద్ధతతో ఉన్నత గౌరవాలను అందుకోవడం యువతకు స్ఫూర్తిదాయకమని పలువురు అభిప్రాయపడ్డారు. శ్రవణ్ పూలే కు లభించిన ఈ గౌరవ డాక్టరేట్ ఆయన భవిష్యత్ సేవలకు నూతనోత్సాహాన్ని నింపనుంది.

Related posts

తహసీల్దార్‌ కార్యయంలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి

TNR NEWS

ఘనంగా అయ్యప్ప స్వామి జన్మ దిన వేడుకలు

TNR NEWS

మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీమ్ లతో అప్రమత్తంగా ఉండాలి. సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ఆయుధం.: పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్

TNR NEWS

కొత్త మెనూ ఖచ్చితంగా పాటించాలి బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

TNR NEWS

మహిళా ఉద్యోగుల పట్ల వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

Harish Hs

తడిసిన ధాన్యం…ఎండలో ఆరబోసిన రైతు 

TNR NEWS