Tnrnews.in
తెలంగాణ

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి ఈ నెల 10 న జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు జరిగే ధర్నా లను జయప్రదం చేయండి సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పిలుపు

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ పార్టీ కార్యకర్తలు రాజీలేని పోరాటం కొనసాగించాలని సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు

సోమవారం నాడు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయం (ధర్మభిక్షం) భవన్ లో జరిగిన ఆ పార్టీ జిల్లా కార్యవర్గం మరియు కౌన్సిల్ సమావేశాలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ….. ఇటీవల కాలంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతున్నారని గ్యాస్ పై ఇప్పటికే 89 రూపాయలు ధర పెంచారని పెట్రోలు, డీజిల్ పై లీటరుకు పది రూపాయలు పెంచారని పైగా దీనికి ముగింపు లేకుండా పోయిందని అంతు పంతు లేకుండా ధరలు పెంచుకుంటూ సామాన్యుడి, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచారని పైగా దేశం కోసం ధర్మం కోసం అంటూ పిచ్చికూతలు కూస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

అందువల్ల ఈ నెల 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయo ముందు వేలాదిమంది సిపిఐ పార్టీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అలాగే ఈనెల 23…24తేదీల్లో సూర్యపేట జిల్లా స్థాయి ముఖ్య నాయకులకు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించనున్నామని ఆగస్టు 6 నుంచి 14వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించనున్నామని సెప్టెంబర్ 28న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన కోరారు

 

*జిల్లా సిపిఐ కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ*.

 

…. జూన్ మరియు జూలై నెలలో అఖిల భారత యువజన సమాఖ్య, జాతీయ మహిళా సమాఖ్య, అఖిల భారత విద్యార్థి సమాఖ్య,, గిరిజన సమాఖ్య, మరియు దళిత హక్కుల పోరాట సమితి జిల్లా మహాసభలు నిర్వహించనున్నామని ఈ నెలాఖరుకు సభ్యత్వంలో పూర్తి చేసి శాఖ మండలం మహాసభలు పూర్తిచేసి ఆయా ప్రజా సంఘాల జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సమావేశానికి పోకల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా

సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు యల్లావుల రాములు, ధూళిపాళ ధనుంజయ నాయుడు, యల్లంల యాదగిరి, బద్దం కృష్ణారెడ్డి, గుండు వెంకటేశ్వర్లు, దేవవరం మల్లీశ్వరి, బూర వెంకటేశ్వర్లు, ఎస్ కే సాయబెల్లి, అనంతుల మల్లీశ్వరి, ఖమ్మంపాటి రాము, కొండ కోటయ్య, రెమిడాల రాజు, ఉత్పతల కోటమ్మ చిలకరాజు శ్రీను, ఏడెల్లి శ్రీకాంత్, పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Harish Hs

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

TNR NEWS

*అదుపుతప్పి కారు బోల్తా.. ఒకరి మృతి* 

TNR NEWS

రఘు కుటుంబాన్ని పరామర్శించిన, ఎంజెఎఫ్ జాతీయ అధ్యక్షుడు దాసు

TNR NEWS

ఆటో డ్రైవర్ నిజాయితీని మెచ్చిన డీఎస్సీ

TNR NEWS

జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి కి ఘన సన్మానం మిత్ర బృందం ఆధ్వర్యంలో వంగవీటి కి ఘన సన్మానం

TNR NEWS