Tnrnews.in
తెలంగాణసినిమా వార్తలు

జూన్ 26న దిష్టిబొమ్మ

హైదరాబాద్ : విభిన్న కథాంశంతో హార్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో ఆర్.గోపు బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దిష్టిబొమ్మ. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు, రచయిత, మ్యూజిక్ డైరెక్టర్, లిరిక్ రైటర్, సింగర్ అక్షయ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ముఖ్య అతిథిగా ఫైట్ మాస్టర్ సాకే అశోక్ రాజ్ మరియు దర్శకుడు పాలమూరు శివ పాల్గొన్నారు. ఈ సమావేశంలో చిత్ర విషయాలను దర్శకుడు ఆర్.గోపు బాలాజీ వెల్లడించారు. కె.ఎస్.సినిమా సమర్పణలో శ్రీ అలిమేలు మంగమ్మ వారి ప్రొడక్షన్ బ్యానర్లో పుండ్ల ఉమాపతి మరియు ఆర్.గోపు నిర్మాతలుగా నిర్మించిన చిత్రం దిష్టిబొమ్మ. దర్శకుడు ఆర్.గోపు బాలాజీ మాట్లాడుతూ చిత్రం ఎంతో ఆసక్తిగా ఉంటుందని, మనిషి చేసిన ప్రతి పనికి కర్మ అనేది తప్పక అనుభవించాల్సి వస్తుందని, దానికి సంబంధించిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి విజయవంతం చేయాలని దర్శకుడు ఆర్.గోపు బాలాజీ కోరారు. ఈ చిత్రంలో హీరోగా ఉమేష్ రాయల్, హీరోయిన్ గాయత్రి, మాళవిక, నటీ నటులు అశోక్ రాజ్, జాబిలి, అమితాబ్, మురళి దేవర, భాను రెడ్డి, తులసి తదితరులు నటించగా… ఆల్డ్రిన్ సంగీతాన్ని అందించారు. కెమెరామెన్ ప్రేమ్ జియాన్, లిరిక్స్ భువన చంద్ర, కొరియోగ్రాఫర్ రామా రావు బండ్ల, ఎడిటర్ మార్టిన్ పాల్ సి.ఎస్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ శ్యామ్ మోహన్ ఏం.ఏం, పి.ఆర్.ఓ డా. సునీల్ కుమార్ యాండ్ర (స్కై రైటింగ్స్).

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

గ్రామశాఖ అధ్యక్షులకు నియమాక పత్రాలు అందజేస్తున్న ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు గుడిపాటి కనకయ్య మాదిగ

Harish Hs

డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన ఎస్సై ప్రవీణ్ కుమార్  

TNR NEWS

బీ ఆర్ స్ , బీజేపీ , కాంగ్రెస్ పార్టీలకు రాజకీయ సమాధి కట్టడమే అంబేద్కర్ కి ఘనమైన నివాళి జిల్లా కన్వీనర్ రవీందర్

TNR NEWS

జుక్కల్ ఎమ్మెల్యేను అభినందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

TNR NEWS

కోదాడ లో కిడ్నీ రాకెట్ ముఠా అరెస్ట్

Harish Hs

గీత కార్మికుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

TNR NEWS