Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో తీసిన గుంతలను వెంటనే పూడ్చాలి.  నెలలు గడుస్తున్న రోడ్ల నిర్మాణం ఎందుకు పూర్తి చేయడం లేదు.?  వర్షాకాలంలో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలి.   కొత్త రోడ్లు వేయాలి.  _సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్

సూర్యాపేట టౌన్: సూర్యాపేట మున్సిపాలిటీ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో పట్టణంలో వేసిన రోడ్లను సైతం పగలగొట్టారని, నెలలు గడుస్తున్న రోడ్ల నిర్మాణం ఎందుకు చేపట్టడం లేదని, రానున్నది వర్షాకాలం దృశ్య ముందస్తు చర్యలు చేపట్టాలని సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్ ప్రశ్నించారు. ఆదివారం సిపిఎం పట్టణ కమిటీ సమావేశం 24 వ వార్డు సీతారాంపురం లో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన సూర్యాపేట పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో కొత్తగా వేసిన రోడ్లన్నీ సైతం వదలకుండా ఇస్తానుసారం రోడ్లను పగలగొట్టి పైపులు వేసిన గుప్తాదారులు దానిపై కొత్త రోడ్డు వేయకుండా వెళ్లిపోయారని ఆరోపించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో రోడ్లను ఇష్టానుసారంగా పగలగొట్టి నెలలు అవుతున్న ఈ విషయంపై స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. తక్షణమే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో పగలగొట్టిన రోడ్లను పునర్నిర్మాణం చేయాలన్నారు. రోడ్లను పగలగొట్టి గుంతలుగా మార్చడంతో నిత్యం అనేకమంది వృద్ధులు, పిల్లలు, వాహనదారులు గుంతలలో పడి కాళ్లు, చేతులు, తలకాయలు పగలగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం ప్రారంభం కానున్నదని, ఈ లోపే రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే కొత్త రోడ్లను నిర్మాణం చేపట్టి సూర్యాపేట పట్టణ ప్రజల ఇబ్బందులను పరిష్కరించాలని లేనియెడల సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు మామిడి పుల్లయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పట్టణ కమిటీ సభ్యులుకప్పల సత్యం, షేక్ జహంగీర్, మాధగోని మల్లేష్,వట్టె ఎర్రయ్య, పిట్టల రాణి, జయమ్ము, శశిరేఖ, భాగ్యమ్మ పాల్గొన్నారు.

Related posts

విద్యా నైపుణ్యాన్ని పరిశీలించిన ప్రిన్సిపాల్

TNR NEWS

కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలి

TNR NEWS

గణేష్ మండపం వద్ద కుంకుమ పూజలలో పోటెత్తిన మహిళలు

TNR NEWS

*ఓ ప్రజా ప్రతినిధి దివ్యాంగుని పై దాడి* ★ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు. ★ ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ★వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షురాలు రాధిక డిమాండ్,

TNR NEWS

పది లక్షల విలువైన నకిలీ విత్తనాలను పట్టుకున్నా జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు ఎస్పీ శ్రీ కె.నారాయణ రెడ్డి

TNR NEWS

శిధిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాలు,ఇళ్లను ఖాళీ చేయించాలి

TNR NEWS