Tnrnews.in
తెలంగాణ

విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఇన్విజిలేటర్లు ఓఎంఆర్ షీట్లపై తప్పుడు హాల్ టికెట్ నెంబర్లు బబ్లింగ్ చేసిన వైనం.. తప్పు తెలుసుకుని దిద్దడంతో ఓఎంఆర్ షీట్ కి బొక్క… ఇష్టానుసారం గా వ్యవహరిస్తున్న ఇన్విజిలేటర్లు పై చర్యలు తీసుకోవాలి… నవోదయ సెంటర్ ముందు ఆందోళన చేసిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు… టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు…

: కోదాడ పట్టణంలోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నవోదయ ఎంట్రన్స్ పరీక్ష కేంద్రంలో కొంతమంది ఇన్విజిలేటర్లు విద్యార్థుల జీవితాలతో చలగాటమాడుతున్నారు. శనివారం పట్టణంలోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నవోదయ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించారు. పరీక్షా సమయం కాగానే ఓఎంఆర్ షీట్ అందించారు. ఇన్విజిలేటర్ విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్ ను బబ్లింగ్ చేశారు. కానీ రావులపెంట మోక్షిత్ అనే విద్యార్థి రోల్ నెంబర్ 3612924 కాగా 9612924 గా బబ్లింగ్ చేయడంతో విద్యార్థి ఇన్విజిలేటర్ ను రోల్ నెంబర్ తప్పుగా దిద్దారు అని ప్రశ్నించాడు. దీంతో ఇన్విజిలేటర్ 9 అంకెను గట్టిగా రబ్ చేయడంతో రంద్రం పడిందని అనంతరం మూడు అంకెలు బబ్లింగ్ చేసిందని తెలిపాడు. అదేవిధంగా జి గాయత్రి అనే విద్యార్థిని రోల్ నెంబర్ 3612963 ని కూడా తప్పుగా బబ్లింగ్ చేసినట్లు ఆరోపించారు. విద్యార్థులు గత రెండు సంవత్సరాలుగా నవోదయ ఎంట్రన్స్ పరీక్ష కోసం శిక్షణ తీసుకున్నారు అని తెలిపారు. తీరా పరీక్షా కేంద్రంలో వారి జీవితాలతో తప్పుడు హాల్ టికెట్ నెంబర్లు వేసి ఇన్విజిలేటర్లు చెలగాటం ఆడారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సదరు నవోదయ సెంటర్ ఇన్సిరేటర్లన పరీక్ష నిర్వాహకులను విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించగా ఏం చేస్తారో చేసుకోండి అని తెలిపారని వాపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొన విషయాన్ని ఆరా తీశారు. వారిని పోలీస్అధికారులు స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అక్షర యోధుడు కాళోజి

Harish Hs

ఘనంగా సెమీ క్రిస్మస్ శాంతి సంతోషాలకు చిహ్నం క్రిస్మస్

TNR NEWS

రైతులపై మొండి వైఖరి చూపెడుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు

Harish Hs

పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి

Harish Hs

కామదేను 2024 అవార్డు  

TNR NEWS

అన్ని బంధాల కన్నా స్నేహబంధం ఎంతో విలువైనది

Harish Hs