Tnrnews.in
తెలంగాణ

సూర్యాపేట:సూర్యాపేట పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ యాడవెందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యాపేట ట్రాఫిక్ సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) ఆటో డ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత ఆటో డ్రైవర్లపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ క్రింది నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు:

డ్రైవింగ్ లైసెన్స్: ఆటో నడిపే ప్రతి డ్రైవర్ తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు పొందిన, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహన పత్రాలను కలిగి ఉండాలి.

మద్యం సేవించి వాహనం నడపరాదు: మద్యం మత్తులో ఆటోలు నడపడం వల్ల అమాయక ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

ట్రాఫిక్ సిగ్నల్ నియమాలు: జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, సిగ్నల్ జంపింగ్ చేయవద్దని స్పష్టం చేశారు.

పరిమితికి మించి ప్రయాణికులు: ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకూడదని, రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ ఆటోలు ఆపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని కోరారు.

నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలతో పాటు వాహనాలు సీజ్ చేస్తామని ఎస్ఐ తెలిపినారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది మరియు స్థానిక ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు

Harish Hs

మునగాల: గంజాయి సేవించిన, విక్రయించిన కఠిన చర్యలు: ఎస్సై ప్రవీణ్ కుమార్

Harish Hs

అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. -స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలి.  -జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ను ఓడించేందుకు వికలాంగుల శ్రేణులు సన్నద్ధం కావాలి. -బీవీహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ 

TNR NEWS

మణుక దేవాలయంకు వచ్చే భక్తులకు నీళ్లకష్టాలు…

TNR NEWS

ముగిసిన రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్

Harish Hs

విద్యార్థులు మాదక,ద్రవ్యాల మత్తులో పడవద్దు!  పరకాల ఏసీపీ సతీష్ బాబు

TNR NEWS