Tnrnews.in
తెలంగాణ

కె.ఎల్ నరసింహారావు కృషిని పాఠ్యాంశాల్లో చేర్చాలి జూలూరు గౌరీ శంకర్

తెలంగాణ నాటక రంగానికి విశేష సేవలందించిన కె.ఎల్ నరసింహారావు రచనలు, కృషిని పాఠ్యపుస్తకాల్లో ఉపవాచకాలుగా చేర్చాలని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ కోరారు. కె.ఎల్ 103వ జయంతి సందర్భంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు..సామాజిక దురాగతాలపై కలం ఎక్కుపెట్టి, ప్రజల్లో చైతన్యం కలిగించేలా 100కు పైగా నాటకాలు రచించి, వేలాది ప్రదర్శనలు ఇచ్చిన గొప్ప రంగస్థల యోధుడు కె.ఎల్ అని కొనియాడారు. ఈ సందర్భంగా వేముల వెంకటేశ్వర్లు సంపాదకత్వంలో వెలువడిన “నాటక రంగ శిఖరం కె.ఎల్ నరసింహారావు” పుస్తకాన్ని జూలూరు ఆవిష్కరించారు. సభలో రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దిరెడ్డి గణేష్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కళాకారులు, గ్రామ పెద్దలు పాల్గొని కె.ఎల్ సేవలను స్మరించుకున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలి

TNR NEWS

TNR NEWS

*మాలల సింహ గర్జన విజయవంతం చేయాలి*

TNR NEWS

జాతీయ రహదారిపై ట్రాక్టర్ బోల్తా – వ్యక్తి మృతి

TNR NEWS

అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి మతోన్మాదుల నుండి దేశాన్ని రక్షించుకోవాలి  వామపక్ష పార్టీలు డిమాండ్

TNR NEWS

ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు

Harish Hs