TG: ఎల్నినోతో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రం మొత్తాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించాలని రేవంత్ ప్రభుత్వాన్ని సీపీఎం స్టేట్ కార్య దర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.50వేలు, ఇతర పంటలకు రూ.30వేల చొప్పున పరిహారం ఇవ్వాలని లేఖలో కోరారు. రేషన్లో బియ్యంతో పాటు 14 రకాల నిత్యావసర సరుకులతో ఉచిత కరువు ఉపశమన కిట్ను ఇవ్వాలని తెలిపారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
