Tnrnews.in
తెలంగాణ

తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి :ఎమ్మెల్యే కూనంనేని

 

జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోయి బీడు భూములుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలని.. కరువు ప్రభావిత ప్రాంతాలకు వెంటనే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎండిపోయిన పంటలకు, బీడు భూములకు పంట నష్టపరిహారం అందించాలని కోరారు. వరి పంటకు ఎకరాకు రూ.30 వేలు, పత్తి, మిర్చి తదితర పంటలకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. వ్యవసాయ కూలీలకు రూ.10 వేల కరువు భత్యం అందించాలని, రేషన్ బియ్యంతో పాటు 16 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని సూచించారు.

 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరువు సమస్యపై దృష్టి సారించకుండా ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటున్నాయని కూనంనేని విమర్శించారు. రైతులు పంటలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వాలు రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణ రాష్ట్రానికి రూ.25 వేల కోట్ల కరువు సహాయ నిధిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

తాటాకు చప్పులకు భయపడను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

TNR NEWS

డ్రగ్స్ సైబర్ నేరాల పైన అవగాహన

Harish Hs

కోలాహలాంగా ప్రారంభమైన పోలీసు క్రీడా పోటీలు

TNR NEWS

ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో మహా న్యూస్ ఎండీ మారెళ్ల వంశీ కృష్ణ పుట్టినరోజు వేడుకలు

Harish Hs

నల్గొండ:- దామచర్ల మండలం వాడపల్లి వద్ద రోడ్డుప్రమాదం..!

TNR NEWS

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో తీసిన గుంతలను వెంటనే పూడ్చాలి.  నెలలు గడుస్తున్న రోడ్ల నిర్మాణం ఎందుకు పూర్తి చేయడం లేదు.?  వర్షాకాలంలో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలి.   కొత్త రోడ్లు వేయాలి.  _సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్

TNR NEWS