TG: ఓటరు జాబితాల ప్రక్షాళన పేరుతో అర్హులైన పౌరులను ప్రజాస్వామ్య ప్రక్రియకు దూరం చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని మంత్రి ఉత్తమ్ హెచ్చరించారు. ‘SIR’పై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తొలగించిన ప్రతి పేరుకు కారణం తెలియాలని, సంబంధిత పౌరుడికి సమాచారం అందాలని, తన వాదన వినిపించుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. పొరపాటుగా తొలగిపోయిన అర్హుల పేర్లను వెంటనే పునరుద్ధరించే సమర్థమైన వ్యవస్థ ఉండాలని సూచించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
